“ఇస్లామిక్ ఎమిరేట్”గా ఆఫ్ఘనిస్థాన్.. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మొదటి దేశం రష్యా!
ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యన్ ఫెడరేషన్ రాయబారి డిమిత్రి జిర్నోవ్ IEA-విదేశాంగ మంత్రి మావ్లావి అమీర్ ఖాన్ ముత్తాకిని కలిశారు. ఈ సమావేశంలో, రష్యన్ ఫెడరేషన్ రాయబారి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌ను గుర్తించాలనే తన ప్రభుత్వ నిర్ణయం గురించి అధికారికంగా తెలియజేశారు. రష్యన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ "ఇస్లామిక్ ఎమిరేట్"ను గుర్తించాలని నిర్ణయించిందని జిర్నోవ్ అధికారికంగా వెల్లడించారు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యన్ ఫెడరేషన్ రాయబారి డిమిత్రి జిర్నోవ్ IEA-విదేశాంగ మంత్రి మావ్లావి అమీర్ ఖాన్ ముత్తాకిని కలిశారు. ఈ సమావేశంలో, రష్యన్ ఫెడరేషన్ రాయబారి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌ను గుర్తించాలనే తన ప్రభుత్వ నిర్ణయం గురించి అధికారికంగా తెలియజేశారు. రష్యన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ “ఇస్లామిక్ ఎమిరేట్”ను గుర్తించాలని నిర్ణయించిందని జిర్నోవ్ అధికారికంగా వెల్లడించారు.
ఆఫ్ఘనిస్తాన్ కు కొత్తగా నియమితులైన రాయబారి గుల్ హసన్ హసన్ కు అర్హత పత్రాలు అందాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు లభించడం వల్ల వివిధ రంగాలలో మన దేశాల మధ్య ఉత్పాదక ద్వైపాక్షిక సహకారం అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నాము” అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా తాలిబాన్‌ను అధికారిక ప్రభుత్వంగా గుర్తించని సమయంలో ఈ నిర్ణయం వచ్చింది. రష్యా విదేశాంగ విధానంలో ఇది ఒక పెద్ద వ్యూహాత్మక మార్పుగా పరిగణిస్తున్నారు. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఇదిలావుంటే, ఐక్యరాజ్యసమితి (UN), యూరోపియన్ యూనియన్ (EU) వంటి సంస్థలు ఇంకా తాలిబాన్‌ను గుర్తించలేదు.
రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇతర దేశాలకు ఇది మంచి ఉదాహరణగా అభివర్ణించారు. ‘ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే నిర్ణయం గురించి రష్యా రాయబారి తెలియజేశారు. ఇది తాలిబాన్-రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలకు చిహ్నం’ అని తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
The Ambassador of the Russian Federation, Mr. Dmitry Zhirnov, called on IEA-Foreign Minister Mawlawi Amir Khan Muttaqi.
During the meeting, the Ambassador of Russian Federation officially conveyed his government’s decision to recognize the Islamic Emirate of Afghanistan, pic.twitter.com/wCbJKpZYwm
— Ministry of Foreign Affairs – Afghanistan (@MoFA_Afg) July 3, 2025
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలన అమల్లోకి వచ్చింది. అమెరికా దళాలు దేశం విడిచి వెళ్లిన తర్వాత, తాలిబన్ నాయకులు ఆ దేశ నాయకత్వాన్ని చేపట్టారు. ప్రస్తుతం, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బాధ్యత అమీర్ ఖాన్ ముత్తాకి వద్ద ఉంది. రష్యా ఇప్పుడు తాలిబన్‌ను అక్రమ సంస్థల జాబితా నుండి తొలగించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..