Britan: పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రోబో.. సభ్యుల ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలు.. వీడియో..

యూనైటెడ్‌ కింగ్‌డమ్‌ పార్లమెంట్‌లో ఇలాంటి అపూర్వ సన్నివేశం చోటుచేసుకుంది. బ్రిటన్‌ పార్లమెంట్‌లో రెండు రోజుల క్రితం మన చిట్టీ తరహా రోబో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.

Britan: పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన రోబో.. సభ్యుల ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలు.. వీడియో..
Britan Parliament
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 13, 2022 | 9:28 PM

కృత్రిమ మేధాస్సు లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది క్రియేటివ్‌ సెక్టార్‌కు ముప్పుగా మారుతోందా? చాలా మంది ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కాని ఈ విషయాలపై ఒక మానవ రూపంలోని రోబో మాట్లాడితే ఎలా ఉంటుంది? యూనైటెడ్‌ కింగ్‌డమ్‌ పార్లమెంట్‌లో ఇలాంటి అపూర్వ సన్నివేశం చోటుచేసుకుంది. బ్రిటన్‌ పార్లమెంట్‌లో రెండు రోజుల క్రితం మన చిట్టీ తరహా రోబో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఈ రోబో పేరు ఐ-దా. ఆండ్రాయిడ్‌తో పనిచేసే ఈ రోబోను ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్ట్రా రియలిస్టిక్‌ ఆర్టిస్ట్‌గా పరిగణిస్తున్నారు. దీన్ని 2019లో తయారు చేశారు. బ్రిటన్‌ పార్లమెంట్‌లోని హౌజ్‌ ఆఫ్‌ లార్డ్స్‌ ప్రతినిధుల ప్రశ్నలకు ఈ రోబో చక్కని సమాధానాలు చెప్పింది. బ్రిటన్‌కు చెందిన 19 శతాబ్దపు గణిత దిగ్గజం అడా లవ్‌లేస్‌ పేరు మీద ఈ రోబోకు ఐ-దా అని పేరు పెట్టారు.

బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌కు చెందిన కమ్యూనికేషన్స్‌ అండ్‌ డిజిటల్‌ కమిటీ సభ్యులు ఈ రోబోను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోలు, కళల గురించి ప్రశ్నలు అడిగారు. తాను మాట్లాడగలుగుతున్నా ఈ విషయాలపై తనకు విషయ పరిజ్ఞానం లేదని, కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌, అల్గోరిథమ్స్‌ ఆధారంగా తాను పనిచేస్తానని ఈ రోబో పలికింది. ఆరెంజ్‌ కలర్‌ బ్లౌజ్‌, డెనిమ్‌ డంగరీ ధరించిన ఈ రోబో తాను కళను సృష్టించగలనని ఈ మానవ రూపం రోబో తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ రోబో మాట్లాడుతున్న సమయంలో టెక్నికల్‌ సమస్యలు ఏర్పడ్డాయి. దాన్ని కళ్లు జాంబీగా మారాయి. దాంతో దీని సృష్టికర్త అయిన అయిడాన్‌-మెల్లర్‌ ఈ రోబోకు సన్‌గ్లాసెస్‌ పెట్టారు. AI అల్గోరిథమ్స్‌ సాయంతో పనిచేసే ఈ రోబో తన కళ్లలో కెమెరాలు, రోబోటిక్‌ మోచేయితో క్యాన్వాస్‌పై చిత్రాలు గీయగలదు, కవిత్వాన్ని సైతం రచించగలదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..