Reham Khan: పాక్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ!
పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీటీఐ(పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ పెట్టింది. ఈ పార్టీ పేరున పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీగా ప్రకటించింది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు, సామాన్యుడి గొంతును బలంగా వినిపించేందకు పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీటీఐ(పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెడుతూ, పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీ అనే తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విదుడల చేసిన ప్రకటనలో.. ఆమె ఇలా ప్రస్తావించింది.. నేను ఇంతకు ముందు ఎప్పుడూ రాజకీయ పదవులను చేపట్టలేదు. కాని ఒకసారి ఒకే ఒక్క వ్యక్తి కోసం నేను ఒక పార్టీలో చేరానని తన మాజీ భర్తను ఉద్దేశిస్తూ తెలిపారు. కానీ ఈ రోజు మాత్రం నేను సొంతంగా రాజకీయాల్లో వస్తున్నట్టు తెలిపారు.
ఇది కేవలం ఒక పార్టీ కాదు, రాజకీయాలను సేవగా మార్చడానికి చేపట్టిన ఉద్యమం అని చెప్పుకొచ్చారు. తన పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని, పాలక వర్గాలను జవాబుదారీగా ఉంచుతుందని ఖాన్ అన్నారు. పాకిస్తాన్‌లో ప్రస్తుత రాజకీయ వాతావరణంపై పెరుగుతున్న అసంతృప్తి, నిరాశ నేపథ్యంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కరాచీలో ప్రెస్ క్లబ్‌లో ఈ వివరాలు వెల్లడించిన ఆమె.. కష్టకాలంలో ఈ ప్రదేశం తనకు అండగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
2012 నుండి 2025 వరకు, తాను చూసిన పాకిస్తాన్‌లో స్వచ్ఛమైన తాగునీరు, కనీస ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వసతులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, పదవుల కోసం కాకుండా దేశంలో పరిస్థితు మార్పు కోసం తమ పార్టీ పని చేస్తుందని ఖాన్ తెలిపారు. అలాగే కుటుంబ రాజకీయాలను విమర్శించారు. ఎవరి మద్దతు లేకుండానే తాను పార్టీ పెట్టినట్టు ఖాన్ చెప్పుకొచ్చారు. త్వరలోనే పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తానని రెహమ్ ఖాన్ తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
