USA: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు తాళం… భద్రతాధికారులను భయపెట్టిన అనుమానాస్పద వస్తువు
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు లాక్ పడింది. అనుమానాస్పద వస్తువులు మంగళవారం వైట్ హౌస్ మీదికి దూసుకురావడ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్‌ను పరుగులు పెట్టించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వైట్‌హౌస్‌కు లాక్‌వేసి, కార్యకలాపాలు కాసేపు నిలిపివేశారు. సోదాల అనంతరం తిరిగి...

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు లాక్ పడింది. అనుమానాస్పద వస్తువులు మంగళవారం వైట్ హౌస్ మీదికి దూసుకురావడ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్‌ను పరుగులు పెట్టించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వైట్‌హౌస్‌కు లాక్‌వేసి, కార్యకలాపాలు కాసేపు నిలిపివేశారు. సోదాల అనంతరం మళ్లీ కార్యకలాపాలు పునరుద్దరించారు. అనంతరం భద్రతను కట్టుదిట్టం చేశారు.
విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్‌మహాన్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూ కోసం హాజరు కావడానికి వైట్ హౌస్ ప్రెస్ పూల్ సభ్యులు వేచి ఉండగా మధ్యాహ్నం ముందు ఈ సంఘటన జరిగింది. విలేకరులను ఇంటి లోపల తీసుకెళ్లారు. నార్త్ లాన్‌లో ఎంట్రీని పూర్తిగా నిలిపివేశారు. ఆ వస్తువు ఏంటనేది అధికారులు వెల్లడించలేదు. కానీ, వైట్‌హౌస్ చూడడానికి వచ్చిన ఓ పర్యాటకుడు తన వ్యక్తిగత వస్తువును లేదా ఫోన్‌ను విసిరి ఉండచ్చని స్థానిక అధికారుల నుంచి అందుతున్న సమాచారం.
“ఎవరో తమ ఫోన్‌ను కంచె మీదుగా విసిరేశారు” అని ట్రంప్ ప్రచార ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అల్ ఇచ్చిన ప్రకటనలో ధృవీకరించారు. అయితే, సీక్రెట్ సర్వీస్ ఆ ప్రకటనను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఉదయం 11:56 గంటలకు నార్త్ లాన్‌కు జర్నలిస్టులు తిరిగి వెళ్లడానికి వీలు కల్పించారు. మధ్యాహ్నం 12:20 గంటలకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో ఒక కార్యక్రమానికి బయలుదేరే ముందు విలేకరులు పామ్ రూమ్‌లో తిరిగి సమావేశమయ్యారు. భద్రతా ఉల్లంఘన గురించి వైట్ హౌస్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
అయితే సీక్రెట్ సర్వీస్ వైట్ హౌస్‌ను లాక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. 2019లో అనుమానాస్పద పార్సల్ రావడంతో వైట్ హౌస్‌కు లాక్ వేశారు. అదేవిధంగా 2018 వైట్‌హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా వాహనం కనిపించడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు అప్రమత్తమై అధ్యక్ష భవనానికి తాళం వేశారు.
