Putin: వాగ్నర్ గ్రూప్‌కు గత ఏడాది రూ.8 వేల కోట్లు చెల్లించామన్న పుతిన్
ఇటీవల రష్యాలో తిరుగుబాటు చేసి తిరిగి వెనక్కి వెళ్లిపోయిన వాగ్నర్ గ్రుప్‌కు ఏడాదిలోనే రూ.8వేల కోట్లు ఇచ్చినట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై చేస్తోన్న సైనిక చర్యల్లో పాల్కొన్న వాగ్నర్ గ్రూప్.. సైనికులకు జీతాలు, ఇతర రివార్డులు అందించిందని చెప్పారు. రక్షణశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పుతిన్ ఈ విషయాలు వెల్లడించారు.

ఇటీవల రష్యాలో తిరుగుబాటు చేసి తిరిగి వెనక్కి వెళ్లిపోయిన వాగ్నర్ గ్రుప్‌కు ఏడాదిలోనే రూ.8వేల కోట్లు ఇచ్చినట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై చేస్తోన్న సైనిక చర్యల్లో పాల్కొన్న వాగ్నర్ గ్రూప్.. సైనికులకు జీతాలు, ఇతర రివార్డులు అందించిందని చెప్పారు. రక్షణశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పుతిన్ ఈ విషయాలు వెల్లడించారు. మే 22 నుంచి మే 2023 దాదాపు ఏడాది కాలం వాగ్నర్ గ్రూప్ సైనికులకు జీతాలు, ఇతర ప్రోత్సహకాల రూపంలో 83.86 బిలియన్ రూబుల్స్‌ను (అంటే మన కరెన్సీలో దాదాపు రూ.8 వేల కోట్లు) ప్రభుత్వం చెల్లించిదని పేర్కొన్నారు. అలాగే సైనిక చర్యల్లో పాల్గొని పోరాడేవారికి ప్రభుత్వమే అన్ని వనరులను సమకూరుస్తుందని తెలిపారు.
వీటిని రక్షణశాఖ, ప్రభుత్వ నిధుల నుంచే అందిస్తు్న్నామన్నారు. మొత్తంగా ఆ గ్రూపుకు పూర్తిగా నిధులు అందించామని రక్షణ అధికారులకు పుతిన్ వివరించారు. వాగ్నర్ గ్రూపుకు ప్రిగోజిన్ నాయకత్వం వహిస్తోన్నాడని చెప్పారు. అయితే అతడు ఏకంగా బిలియన్ రూబిళ్లను సంపాదించాడని.. వాగ్నర్ గ్రూపుతోపాటు వారి నాయకుడికి చెల్లించిన డబ్బు ఎలా ఖర్చయ్యిందో అనే దానిపై అధికారులు విచారణ జరుపుతారని పుతిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు అంశాన్ని ప్రస్తావించిన పుతిన్..అది విజయవంతమైతే దాన్ని తమ శత్రువులు అవకాశంగా మలచుకునేవారని పేర్కొన్నారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా తాము సాధించిన విజయాలను కోల్పోయేవాళ్లమని వివరించారు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..