AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Professional Queuer: క్యూలో నిలబడటమే అతని ఉద్యోగం.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు..

Professional Queuer: సంపాదించడానికి తెలివి, ఆలోచన ఉండాలి గానీ.. ఎలాగైనా డబ్బు మన చేతికి వస్తుందటున్నాడు లండన్ వాసి.. క్యూలో నిలబడి మరి రోజుకు

Professional Queuer: క్యూలో నిలబడటమే అతని ఉద్యోగం.. జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు..
Professional Queuer
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 16, 2022 | 10:08 PM

Professional Queuer: సంపాదించడానికి తెలివి, ఆలోచన ఉండాలి గానీ.. ఎలాగైనా డబ్బు మన చేతికి వస్తుందటున్నాడు లండన్ వాసి.. క్యూలో నిలబడి మరి రోజుకు రూ.16 వేలు సంపాదిస్తున్నాడు. అదేంటీ ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అనుకుంటున్నారా..? ఇది నిజం.. ఇప్పుడు ఈ అసలు విషయాన్ని మీరు తెలుసుకోండి.. కరోనా వచ్చినప్పటి నుంచి షాపింగ్ కాంప్లెక్సులు, అన్ని చోట్ల భౌతిక దూరం లాంటి నియమాలను పాటించాల్సి వస్తోంది. దీనికారణంగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ వంటి వాటి దగ్గర పెద్ద పెద్ద క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. దీనికారణంగా గంటల తరబడి ఏం నిల్చుంటాంలే.. అనుకునే కొంతమంది షాపింగ్ చేయకుండానే వెనుదిరుగుతున్నారు. అలాంటి వారికోసం.. బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ (31) అనే వ్యక్తి ఆలోచించాడు. ఉదయాన్ని షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్ వద్దకు చేరి ఇలా గంటల తరబడి క్యూలో నిల్చుంటాడు. ఎవరికోసం అనుకుంటున్నారు.. ధనవంతుల కోసం.. ఇలా క్యూలో నిల్చొని వారికి కావాల్సింది కొనుగోలు చేసి ఇస్తాడు. ఇలా అతను కొనుగులు చేసి వారికి ఇచ్చినందుకు.. ధనవంతులు ఫ్రెడ్డీకి డబ్బులు ఇస్తుంటారు.

ప్రస్తుతం ఫ్రెడ్డీ ఇలా గంటల కొద్దీ లైన్లలో నిలబడి రోజుకు సగటున (£160) 160 యూరోలు, గంటకు (£20) యూరోలు సంపాదిస్తాడు. అదే మన కరెన్సీలో రోజుకు రూ. 16 వేలు సంపాదిస్తున్నాడు. అయితే.. తాను మూడేళ్లుగా ఇదే ఉద్యోగం చేస్తున్నానని.. తాను ప్రొఫేషనల్ క్యూవర్‌ను అంటూ ఫ్రెడ్డీ బెకిట్ పేర్కొంటున్నాడు. తనకు ఇలా చేయడం బాగా ఉందని.. అవసరమైన వాళ్లు తన సేవలను వినియోగించుకుంటున్నారని వెల్లడిస్తున్నాడు.

కాగా.. క్యూలో గంటల తరబడి నిలబడలేని ధనికులు, వారి పిల్లలు ఫ్రెడ్డీ సేవలు బాగా వినియోగించుకుంటారని అక్కడ మీడియా పేర్కొంటోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు, సినిమా టిక్కెట్ల కోసం వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు తనను సంప్రదిస్తుంటారని ఫ్రెడ్డీ పేర్కొంటున్నాడు. అయితే.. ఇలా క్యూలో నిలబడి చేతినిండా సంపాదించడంతో పాటూ ఫ్రెడ్డీ అప్పుడప్పుడూ.. నవలలు కూడా రాస్తుంటాడట. ఏదీ ఏమైనప్పటికీ.. ఫ్రెడ్డీని చూసినవారికి ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చనే ఐడియా పుడుతుందంటున్నారు.. నెటిజన్లు.

Also Read:

Viral Video: వామ్మో.. చేతితో పాముకు నీళ్లు తాపించాడు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.!

Viral Video: ఈ హంస చేస్తోన్న పనిని చూసి మనుషులు సిగ్గు పడాల్సిందే.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు!