Viral Video: వామ్మో.. చేతితో పాముకు నీళ్లు తాపించాడు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.!

Snake Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని

Viral Video: వామ్మో.. చేతితో పాముకు నీళ్లు తాపించాడు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే.!
Snake Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 16, 2022 | 5:37 PM

Snake Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి పాములు చాలా ప్రమాదకరమైన జంతువులు. వాటి పేరు వింటేనే.. చాలామంది భయంతో పరుగులు తీస్తుంటారు. ఇక దగ్గరగా ఓ పెద్ద పామును చూస్తే.. ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకటే ప్రాణం పోయినంత పనవుతుంది. తాజాగా ఓ పాముకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక పాము కనిపిస్తుంది. దానికి ఒక వ్యక్తి తన చేతితో నీరు తాపిస్తున్నాడు. మీరు ఈ వీడియో చూస్తే.. వామ్మో ఇదేంటి అంటూ భయపడుతారు. అంతేకాకుండా మీ గుండె వేగం కూడా పెరుగుతుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఒక వ్యక్తి తన అరచేతిలో నీళ్లు పోసి పాముకి ఎలా తాపిస్తున్నాడో ఇందులో చూడవచ్చు. ఆ వీడియోలో కనిపిస్తున్నది చూస్తే ఎవరైనా తన చేతిలోని నీటిని పాముకి తాపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. వీడియో చూస్తుంటే ఈ పాము ఆ వ్యక్తి పెంపుడు పాములా అనిపిస్తోంది.

వైరల్ వీడియో..

దీనిని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పాములు ఎప్పటికీ మనుషులకు స్నేహితులు కావంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా.. అది ఎల్లప్పుడూ విషంతో ఉంటుందని.. దానితో జాగ్రత్తగా ఉండాలంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

కాగా.. ఈ వీడియో 2020 జూన్‌లో షేర్ చేయగా.. తాజాగా మళ్లీ వైరల్ అవుతోంది.

Also Read:

Viral Video: ఈ హంస చేస్తోన్న పనిని చూసి మనుషులు సిగ్గు పడాల్సిందే.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు!

Shocking Video: బ్రిడ్జి విరిగిపడి నదిలో పడటం చూశారా.. వందల మంది కొట్టుకుపోయారు..?