‘మహిమాన్విత నూనె’ కోసం తొక్కిసలాట..20 మంది మృతి .!

ఓ మత బోధకుడిపై పెట్టుకున్న గుడ్డినమ్మకం కారణంగా 20 మంది ప్రాణాలు విడిచారు.. 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. టాంజానియాలోని మోషి టౌన్‌లో ఎవాంజెలికల్‌ క్రిస్టియన్‌ చర్చి ఉంది.. అందులో బోనిఫేస్‌ వాంపోసా అనే ఓ మత బోధకుడు ప్రార్థన కార్యక్రమం పెట్టాడు.. పెడితే పెట్టాడు కానీ… అనవసరమైన గొప్పలు చెప్పుకున్నాడు.. తాను దైవదూతనన్నాడు..సమస్త వ్యాధులను నయం చేసే పవిత్రమైన నూనె తన దగ్గర ఉందన్నాడు.. ఇంకా చాలా చాలా చెప్పాడు.. నిజమే కాబోలనుకున్నారు […]

'మహిమాన్విత నూనె' కోసం తొక్కిసలాట..20 మంది మృతి .!
Follow us
Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 03, 2020 | 2:33 PM

ఓ మత బోధకుడిపై పెట్టుకున్న గుడ్డినమ్మకం కారణంగా 20 మంది ప్రాణాలు విడిచారు.. 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. టాంజానియాలోని మోషి టౌన్‌లో ఎవాంజెలికల్‌ క్రిస్టియన్‌ చర్చి ఉంది.. అందులో బోనిఫేస్‌ వాంపోసా అనే ఓ మత బోధకుడు ప్రార్థన కార్యక్రమం పెట్టాడు.. పెడితే పెట్టాడు కానీ… అనవసరమైన గొప్పలు చెప్పుకున్నాడు.. తాను దైవదూతనన్నాడు..సమస్త వ్యాధులను నయం చేసే పవిత్రమైన నూనె తన దగ్గర ఉందన్నాడు.. ఇంకా చాలా చాలా చెప్పాడు.. నిజమే కాబోలనుకున్నారు జనం… మత బోధకుడు చల్లే పవిత్రమైన నూనె ఎక్కడ తమ మీద పడదోనన్న బెంగతో అందరూ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు.. ఫలితంగా తొక్కసలాట జరిగింది.. రోగాలు నయమవ్వడం దేవుడెరుగు.. ఆ ఘటనలో 20 మంది ప్రాణాలు విడిచారు.. గాయపడిన 16 మంది నూనె జోలికి పోకుండా హాస్పిటల్‌లో చేరారు.. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి బిచాణా ఎత్తేశాడు.. పారిపోయిన అతడిని పోలీసులు వెతికి పట్టుకుని జైల్లో తోశారు.. ఇక టాంజానియా అధ్యక్షుడు మగుఫులి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.