పేదరికంలో మగ్గుతున్న పాకిస్తాన్ ……..ప్రపంచ బ్యాంక్ అంచనా…….రాబోయే కాలంలో తగ్గవచ్చునని సూచన
పాకిస్తాన్ పేదరికంలో మగ్గుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.2020 లో ఇది 4.4 శాతం నుంచి 5.4 శాతం పెరిగినట్టు వెల్లడించింది. దాదాపు 20 లక్షలమంది పేదలు ఉన్నారని, అయితే రాబోయే కాలంలో వీరి సంఖ్య తగ్గవచ్చునని పేర్కొంది.
పాకిస్తాన్ పేదరికంలో మగ్గుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.2020 లో ఇది 4.4 శాతం నుంచి 5.4 శాతం పెరిగినట్టు వెల్లడించింది. దాదాపు 20 లక్షలమంది పేదలు ఉన్నారని, అయితే రాబోయే కాలంలో వీరి సంఖ్య తగ్గవచ్చునని పేర్కొంది. 2020-21 లో పాక్ లో పేదరికం నిష్పత్తి 39.3 శాతం కాగా 2020-21 లో కూడా 39.2 శాతం ఉందని, 2022-23 నాటికి 37.9 శాతానికి తగ్గవచ్చునని ఈ బ్యాంకు వెల్లడించింది. మొత్తం మీద 40 శాతం మంది ఓ మాదిరి నుంచి తీవ్ర స్థాయిలో ఆహార కొరతను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయని…ముఖ్యంగా కోవిద్ పాండమిక్ కారణంగా వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణించిందని అభిప్రాయపడింది. పేద, వర్ధమాన దేశాల్లో మాదిరే లక్షల మంది ఉపాధి కోల్పోయారు..వ్యవసాయం వంటి రంగాలు కుదేలయ్యాయి. చిన్న, మధ్య తరగతి కార్మికులు తమ జీవనోపాధి కోల్పోయి వలస బాట పట్టారు.. అని వరల్డ్ బ్యాంకు వివరించింది. రెండు దశాబ్దాలుగా పాక్ ఎకానమీ తరచూ పుంజుకున్నప్పటికీ కోవిద్ ప్రభావం దాని మీద పడింది. అయితే ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల కారణంగా కొంతవరకు మెరుగు పడినట్టు తన అంచనాల్లో పేర్కొంది.
అయితే ప్రభుత్వం మాత్రం తన సొంత లెక్కలు విడుదల చేసింది. 2015-16 తో పోలిస్తే తమ దేశంలో పేదరికం 2018-19 నాటికి 24.3 శాతం నుంచి 21.9 శాతానికి తగ్గినట్టు వివరించింది. వరల్డ్ బ్యాంకు ఏ ప్రాతిపదికపై తమ అంచనాలను విడుదల చేసిందో వివరించాలని డిమాండ్ చేసింది. ఆర్ధిక లోటును భర్తీ చేయడానికి , ద్రవ్యోల్బణం పెరుగుదలను అరికట్టడానికి పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. పేదల అభ్యున్నతికి ఇంకా కృషి చేస్తున్నట్టు తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి: నేడో, రేపో టీపీసీసీ కొత్త చీఫ్..!కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తులకు బ్రేక్ :Telangana New PCC Chief ? Live Video
viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.
Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్ క్లారిటీ వీడియో .