AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రెజిల్‌లో ప్రధాని మోదీకి సంగీత స్వాగతం.. మంత్రముగ్ధులను చేసిన బ్రెజిలియన్ టీమ్!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. గేలియో అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి పర్యటిస్తున్నారు.

బ్రెజిల్‌లో ప్రధాని మోదీకి సంగీత స్వాగతం.. మంత్రముగ్ధులను చేసిన బ్రెజిలియన్ టీమ్!
Pm Modi Receives Musical Welcome
Balaraju Goud
|

Updated on: Jul 06, 2025 | 11:12 AM

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. గేలియో అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి పర్యటిస్తున్నారు.

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూలై 05) సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరో చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రవాసులు ప్రధాని మోదీకి అనూహ్య స్వాగతం పలికారు. బ్రెజిలియన్ సంగీత బృందం సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. “జై జగదంబ మా దుర్గా” అనే భక్తి గీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వీడియో చూడండి.. 

సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి చిత్రాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు తమ చేతుల్లో త్రివర్ణ పతాకంతో ప్రధానికి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ సంబంధించిన ఒక దృశ్యం కనువిందు చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులపై భారత్ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆధారంగా ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమం డాన్స్, చిత్రాల ద్వారా ప్రదర్శించారు.

బ్రెజిల్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ, “రియో డి జనీరోలో బ్రెజిల్‌లోని భారతీయ సమాజ సభ్యులు నాకు చాలా హృదయపూర్వక స్వాగతం పలికారు. వారు భారతీయ సంస్కృతితో ఎంతగా ముడిపడి ఉన్నారో, భారతదేశ అభివృద్ధి పట్ల వారికి ఎంత మక్కువ ఉందో ఆశ్చర్యంగా ఉంది” అని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూలై 6 మరియు 7 తేదీల్లో రియో ​​డి జనీరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశానికి రావడం ఇదే తొలిసారి.

బ్రెజిల్ చేరుకునే ముందు, ప్రధానమంత్రి మోదీ అర్జెంటీనాకు ద్వైపాక్షిక పర్యటనను పూర్తి చేశారు – 57 సంవత్సరాలలో ఒక భారత ప్రధానమంత్రి చేసిన మొదటి పర్యటన ఇది. అక్కడ ఆయన అధ్యక్షుడు జేవియర్ మిలేతో విస్తృత చర్చలు జరిపారు. ఈ పర్యటనలో రక్షణ, కీలకమైన ఖనిజాలు, ఔషధాలు, శక్తి, మైనింగ్ వంటి రంగాలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తృతం చేయడానికి, సహకారాన్ని పెంపొందించడానికి ఒప్పందాలు కుదిరాయి. ఇదిలావుంటే, బ్యూనస్ ఎయిర్స్ నగర ప్రభుత్వం ప్రధాని మోదీని ఘనంగా సత్కరించింది. ఆ నగర ప్రభుత్వ అధిపతి జార్జ్ మాక్రీ, ప్రధాని మోదీకి ‘కీ టు ది సిటీ’ అవార్డును బహుకరించారు. ఇది భారతదేశం-అర్జెంటీనా సంబంధాలకు మోదీ చేసిన కృషికి ప్రతీక. “మిస్టర్ జార్జ్ మాక్రి నుండి బ్యూనస్ ఎయిర్స్ నగర తాళంచెవిని స్వీకరించడం గౌరవంగా ఉంది” అని ప్రధాన మంత్రి Xలో పోస్ట్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..