AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: భూటాన్ నుంచి స్వదేశానికి తిరుగుపయనంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం..

భూటాన్‌లో తన రెండు రోజుల పర్యటన ముగించుకున్నారు ప్రధాని మోదీ. భూటాన్ లోని పారో అంతర్జాతీయ విమానం నుంచి బయలుదేరి ఆదివారం భారత్ కు బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడ జరిగిన ద్వైపాక్షిక సంబంధాల గురించి ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందన్నారు.

PM Modi: భూటాన్ నుంచి స్వదేశానికి తిరుగుపయనంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం..
Pm Modi
Srikar T
|

Updated on: Mar 23, 2024 | 10:18 AM

Share

భూటాన్‌లో తన రెండు రోజుల పర్యటన ముగించుకున్నారు ప్రధాని మోదీ. భూటాన్ లోని పారో అంతర్జాతీయ విమానం నుంచి బయలుదేరి ఆదివారం భారత్ కు బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడ జరిగిన ద్వైపాక్షిక సంబంధాల గురించి ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందన్నారు. ఈ పర్యటనలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ తిరుగు ప్రయాణమైన సందర్భంగా ఒక ట్వీట్ చేశారు.

“థాంక్యూ భూటాన్! ఇది చిరస్మరణీయమైన పర్యటన. ఈ అద్భుతమైన దేశ ప్రజల నుండి నేను పొందిన అభిమానాన్ని ఎప్పటికీ మరచిపోలేను. అక్కడ చేపట్టిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు తనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చాయన్నారు. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ద్వైపాక్షికతను మెరుగుపరుస్తాయని భూటాన్ నుండి బయలుదేరే ముందు ప్రధాని మోడీ అన్నారు. అలాగే తిరుగు పయనమైన సమయంలో తనకు రెడ్ కార్పేట్ వేసి మరీ సాగనంపిన తీరు మనసును హత్తుకుందన్నారు. అక్కడి ప్రదేశాలు, వాతావరణం తనకు సరికొత్త అనుభూతిని కలిగించిందన్నారు” .

ఇవి కూడా చదవండి

భూటాన్ రెండు రోజుల పర్యటన ముగించుకుని స్వదేశంలో అడుగు పెట్టిన ప్రధాని మోదీకి విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగన వెంటనే భూటాన్ లోని అనుభూతులను విదేశాంగ మంత్రితో చర్చించారు ప్రధాని మోదీ. గతంలో ఇలాగే భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..