PM Modi in Bhutan: ప్రధాని మోదీకి భూటాన్‌లో స్వీట్ సర్‌ప్రైజ్
ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్రూక్ గ్యాల్పో’ను ఆయన అందుకున్నారు. భూటాన్‌కు చేరుకొన్నాక మోదీ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక వేడుకల్లో భారతీయ సంస్కృతి, పాటలు ప్రముఖంగా కనిపించాయి. గుజరాతీ, హిందీ పాటలకు కళాకారులు నృత్యాలు చేశారు.
2 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం భూటాన్ వెళ్లారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయనకు ఆ దేశంలో అపూర్వ స్వాగతం లభించింది. రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరువుతున్నారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్యూక్ గ్యాల్పో’ను మోదీ అందుకున్నారు. ఆ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
కాగా ప్రధాని గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గుజరాతీ, హిందీ పాటలకు కళాకారులు నృత్యాలు చేశారు. వారి ప్రదర్శనను ప్రధాని ఆసక్తిగా తిలికించారు. ఆ దృశ్యాలు ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2014లో భారత ప్రధానిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

