PM Modi: ఈ పురస్కారాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నా.. ప్రధాని మోదీ కీలక ట్వీట్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. ప్రధాని మోదీ భూటాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్న ప్రధాని మోదీకి పారో ఎయిర్‌పోర్టులో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే.. ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ దౌత్య సంబంధాలపై చర్చల్లో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందుకున్నారు. ప్రధాని మోదీ భూటాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ చేరుకున్న ప్రధాని మోదీకి పారో ఎయిర్‌పోర్టులో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే.. ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ దౌత్య సంబంధాలపై చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూటాన్ ప్రభుత్వం.. అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను అందజేసింది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ శుక్రవారం ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో సత్కరించి అభినందించారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పోను అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. ఈ అవార్డును మొదటిసారిగా డిసెంబర్ 2021లో భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. “నరేంద్ర మోదీ జాతీయ, ప్రాంతీయ మరియు ప్రపంచ నాయకత్వానికి అత్యుత్తమ స్వరూపం. అతని ఆధ్వర్యంలో, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది” అని ప్రధానమంత్రికి ప్రదానం చేస్తూ భూటాన్ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా, ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి విదేశీ ప్రముఖుడిగా, అవార్డు అందుకున్న నాలుగో వ్యక్తిగా నిలిచారు.
ప్రధాని మోదీ ట్వీట్..
ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో అవార్డును అందుకున్న అనంతరం ప్రధాని మోదీ ఆసక్తికర వీడియోను ఎక్స్ లో షేర్ చేసి 140 కోట్ల మంది ప్రజలకు అంకితం చేస్తున్నట్లు రాశారు. “నేను చాలా వినయంతో ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పోని అంగీకరిస్తున్నాను. అవార్డును అందించినందుకు భూటాన్ రాజు హెచ్‌ఎమ్‌కి కృతజ్ఞతలు. దీన్ని 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నాను. భారతదేశం-భూటాన్ సంబంధాలు పెరుగుతూనే ఉంటాయి, మన పౌరులకు ప్రయోజనం చేకూరుస్తాయని నాకు నమ్మకం ఉంది, ”అని ప్రధాని మోదీ X లో పోస్ట్ చేశారు.
It is with great humility that I accept the Order of the Druk Gyalpo. I am grateful to HM the King of Bhutan for presenting the Award. I dedicate it to the 140 crore people of India. I am also confident that India-Bhutan relations will keep growing and benefit our citizens. pic.twitter.com/bDtKZJsS7X
— Narendra Modi (@narendramodi) March 22, 2024
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. కాగా.. చరిత్రలో తొలిసారిగా ఒక భారత ప్రధానికి భూటాన్ రాజు ప్రైవేట్ విందును ఏర్పాటు చేశారు.
భారత్-భూటాన్ మధ్య స్నేహ బంధం బలపడింది..
భూటాన్‌కు అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయం భారత్-భూటాన్ స్నేహ బంధాలను బలోపేతం చేస్తుందని, ఇరు దేశాల మధ్య అసాధారణమైన సంబంధాలను బలోపేతం చేస్తుందన్నారు. “ఈ అత్యున్నత గౌరవం పొందిన మొదటి విదేశీ నాయకుడు ప్రధాని మోడీ కావడం ఆయన వ్యక్తిగత స్థాయికి, మా ప్రత్యేక సంబంధాలకు ప్రతిబింబం” అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..