Canary Islands: బీచ్‌లో గులకరాళ్లు ఏరుకెళితే.. రూ. 2 లక్షల ఫైన్.!
స్పెయిన్‌కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్ పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. లాంజరోటే ద్వీపంలో సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరుకెళ్లే టూరిస్టులపై 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం రాళ్లు, మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ ప్రాంతం ఏటా తీరం వెంబడి భారీ స్థాయిలో అగ్నిపర్వత ధూళి, మట్టి కోల్పోతున్నాయని చెప్పారు.
స్పెయిన్‌కు చెందిన ద్వీప సముదాయం కెనరీ ఐల్యాండ్స్ పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. లాంజరోటే ద్వీపంలో సముద్ర తీరం నుంచి గులకరాళ్లు ఏరుకెళ్లే టూరిస్టులపై 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం రాళ్లు, మట్టి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ ప్రాంతం ఏటా తీరం వెంబడి భారీ స్థాయిలో అగ్నిపర్వత ధూళి, మట్టి కోల్పోతున్నాయని చెప్పారు. మిగిలిన రాళ్లను టూరిస్టులు తన పర్యటన తాలూకు గుర్తులుగా తీసుకెళుతుండటంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోందని వెల్లడించారు. టూరిస్టుల రాకడ ఎక్కువవడంతో కెనరీ ఐలాండ్స్ వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. ఓ హోటల్ అతిథులకోసం స్థానికులు వినియోగించిన దానికంటే నాలుగు రెట్లు అధికంగా నీరు వినియోగిస్తున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ద్వీపంలోని చాలా ప్రాంతాల్లో క్షామం తరహా పరిస్థితులు నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక్కడి జనాభా 10 లక్షల మంది కాగా, టూరిస్టుల సంఖ్య దీనికి ఐదురెట్లు ఉంటుంది. దీంతో, అక్కడి వ్యవస్థలు కుప్పకూలే స్థితిలో ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు కఠినంగానే ఉన్నా వాటిని అమలు చేయడం అంత ఈజీ కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏ గులకరాయి ఎక్కడి నుంచి సేకరించారో గుర్తించడం దాదాపు అసాధ్యమని హెచ్చరిస్తున్నారు. కెనరీ ఐల్యాండ్స్ ఓ ద్వీపసముదాయం. ఇది స్పెయిన్‌లో స్వతంత్రప్రతిపత్తి కలిగిన ప్రాంతం. బీచ్‌లు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి గాంచింది. కెనరీ ఐలాండ్స్‌లో అతిపెద్ద ద్వీపం టెనెరీఫ్. స్పెయిన్‌లోని అతిపెద్ద పర్వతం మౌంట్ టీడీ టెనెరిఫ్‌లోనే ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

