PM Modi: మాస్కో ఉగ్రదాడిపై ప్రధాని మోడీ రియాక్షన్.. రష్యాకు అండగా ఉంటామని హామీ
మాస్కోలోని ఓ కన్సర్ట్ హాల్ లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈఘటనను ఖండించారు. ఇది హేయమైన చర్య అని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మాస్కోలోని ఓ కన్సర్ట్ హాల్ లో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈఘటనను ఖండించారు. ఇది హేయమైన చర్య అని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మా ప్రార్థనలు బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. ఈ విషాద ఘటనలో రష్యన్ ప్రజలకు భారత్ మద్దుతుగా నిలుస్తుందని ట్వీటర్ లో స్పందించారు. మాస్కో సమీపంలోని కచేరీ వేదిక సముదాయంలో శుక్రవారం దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందిని ప్రాణాలు కోల్పోయారు. దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది.
వార్తా సంస్థ అమాక్ శుక్రవారం టెలిగ్రామ్ లో ప్రచురించిన ఓ ప్రకటనలో ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే ఇందుకుగాను ఐసిస్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐఎస్ఐఎస్-కేగా పిలిచే ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ మాస్కోపై దాడికి కుట్ర పన్నినట్లు మార్చిలో అమెరికా నిఘా సమాచారాన్ని సేకరించింది. ఐసిస్ సభ్యులు రష్యాలో క్రియాశీలకంగా ఉన్నారని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ తన మళ్లీ దాడులతో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోందని అమెరికా ఉగ్రవాద నిరోధక అధికారులు తెలిపారు. ఐరోపాలో ఆ కుట్రలు చాలావరకు విఫలం అయ్యాయి. గత రెండేళ్లుగా రష్యాపై ఐసిస్-కే దృష్టి సారించిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రచారంలో తరచూ విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని న్యూయార్క్ కు చెందిన సెక్యూరిటీ కన్సల్టింగ్ సంస్థ సౌఫాన్ గ్రూప్ కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విశ్లేషకుడు కొలిన్ పి క్లార్క్ తెలిపారు.