Pakistan Political Crisis: హాట్.. హాట్‌గా పాక్ రాజకీయాలు.. తాత్కాలిక ప్రధానిగా ఇమ్రాన్ ఎవరిని ప్రతిపాధించాడో తెలుసా..

పాకిస్తాన్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తాత్కాలిక ప్రధానిగా పాకిస్తాన్ మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్‌ను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ఫవార్ చౌదరి ట్వీట్ ద్వారా తెలియజేశారు.

Pakistan Political Crisis: హాట్.. హాట్‌గా పాక్ రాజకీయాలు.. తాత్కాలిక ప్రధానిగా ఇమ్రాన్ ఎవరిని ప్రతిపాధించాడో తెలుసా..
Pm Imran Khan Nominates
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 04, 2022 | 5:47 PM

పాకిస్తాన్(Pakistan) రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తాత్కాలిక ప్రధానిగా పాకిస్తాన్ మాజీ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్‌ను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ఫవార్ చౌదరి ట్వీట్ ద్వారా తెలియజేశారు. గుల్జార్ అహ్మద్ 2019లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి లేఖకు ప్రతిస్పందనగా తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(Pakistan Tehreek e Insaf) కోర్ కమిటీతో సంప్రదింపులు, ఆమోదం పొందిన తరువాత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్‌ను(Former Chief Justice Gulzar Ahmed) తాత్కాలిక ప్రధానమంత్రిగా నామినేట్ చేశారు అని ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు. అయితే పాక్‌ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ ఇమ్రాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది.

ఆర్టికల్ 224-A(1) ప్రకారం తాత్కాలిక ప్రధాని పేరును ప్రతిపాదించాల్సిందిగా కోరుతూ ఇవాళ తెల్లవారుజామున అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్‌లకు లేఖ రాశారు. ప్రధానమంత్రిని తాత్కాలికంగా నియమించే వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి బాధ్యతలను నిర్వహిస్తారని రాష్ట్రపతి తన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

గుల్జార్ అహ్మద్ కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ తాత్కాలిక ప్రధాని కోసం రెండు పేర్లను రాష్ట్రపతికి పంపారు. వీరిలో రిటైర్డ్ జస్టిస్ అజ్మత్ సయీద్, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హరూన్ అస్లాం పేర్లు ఉండించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నేత షాబాజ్ షరీఫ్ అధ్యక్షుడి పేరును వెల్లడించేందుకు నిరాకరించారు.

జస్టిస్ గుల్జార్ అహమ్ పాకిస్తాన్ 27వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 డిసెంబర్ 21న పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గుల్జార్ అహ్మద్ ఫిబ్రవరి 2022 వరకు పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గుల్జార్ 2 ఫిబ్రవరి 1957న కరాచీలో జన్మించారు.

ఇవి కూడా చదవండి: Stock Market: రంకెలేసిన బుల్.. 3 నెలల తర్వాత 30 లక్షల కోట్ల లాభం.. ఫుల్ జోష్‌లో ఇన్వెస్టర్లు ..

Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..