ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
కొన్ని రోజులుగా పరస్పరం దాడులు చేసుకున్న ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లు చల్లబడ్డాయి.. రెండు దేశాలు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి..
కొన్ని రోజులుగా పరస్పరం దాడులు చేసుకున్న ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లు చల్లబడ్డాయి.. రెండు దేశాలు శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.. ఘర్షణలకు భరతవాక్యం పలికాయి.. అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కారాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం రెండు దేశాలు తుపాకులు ఎక్కుపెట్టాయి.. నిజానికి ఈ ప్రాంతంపై రెండు దేశాలు తీవ్రంగా కొట్టుకున్నాయి.. ఈ పోరాటంలో 30 మంది చనిపోయారు కూడా.. నిజానికి 1994లో కుదిరిన యుద్ధ విరమణ సంధి ప్రకారం నాగోర్నో కారాబాఖ్ ప్రాంతం ఆర్మేనియా దళాల నియంత్రణలో ఉంది.. అయినప్పటికీ రెండు దేశాలు అప్పుడప్పుడు యుద్ధానికి కాలుదువ్వాయి.. మొన్న సెప్టెంబర్ 27 నుంచి అయితే పూర్తిస్థాయిలో యుద్ధమే చేశాయి.. అనేకసార్లు కాల్పుల విరమణకు పిలుపునిచ్చినా రెండు దేశాలు ఉల్లంఘనలకు పాల్పడ్డాయి.. సుషిని నగరాన్ని అజర్‌బైజాన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది కూడా! దీంతో శాంతి ఒప్పందం అనివార్యమయ్యింది.. తాజా ఒప్పందం ప్రకారం రష్యా నుంచి రెండు వేల మంది రష్యన్ శాంతి దళాలను వివాదాస్పద ప్రాంతంలో మోహరించాలని తీర్మానించాయి.. ఆర్మేనియాకు చెందిన భద్రతా బలగాలు నాగర్నో కారాబఖ్ సరిహద్దులోని ప్రాంతాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. వచ్చే అయిదేళ్ల పాటు ఈ ప్రాంతంలో రష్యా దళాలు ఉంటాయి.