AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth : బేగం బజార్‌లో పర్సులు, నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను.. జబర్దస్త్ షోతో గుర్తింపు.. కమెడియన్..

మొదట హోటళ్లలో పని చేసి, చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించిన వ్యక్తి.. ఇప్పుడు బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటివరకు 42 సినిమాలు చేసినా, ఒక పెద్ద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం కోల్పోవడం గురించి కూడా ప్రస్తావించారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

Jabardasth : బేగం బజార్‌లో పర్సులు, నైటీలు, స్కూల్ బ్యాగులు అమ్మాను.. జబర్దస్త్ షోతో గుర్తింపు.. కమెడియన్..
Comedian Komaram
Rajitha Chanti
|

Updated on: Feb 14, 2026 | 6:06 PM

Share

జబర్దస్త్ కమెడియన్ కొమరం అలియాస్ కొమురక్క గతంలో ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాలను, జబర్దస్త్ షో తర్వాత తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొమరం తన అసలు పేరు కుమార్ అని తెలిపారు. ఆయన తన ప్రయాణాన్ని పేదరికం, కష్టాలతో సాగినట్లు గుర్తుచేసుకున్నారు. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌కు వచ్చి తాజ్ మహల్, కామత్, నందిని, అమృత, సుదర్శన్, ఉడుపి వంటి అనేక హోటళ్లలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. అక్కడ స్టాఫ్ రూంలో కిరాణా షాపు పెట్టి, డ్యూటీ తర్వాత బేగం బజార్‌లో పర్సులు, ఎఫ్ఎం రేడియోలు, నైటీలు, స్కూల్ బ్యాగులు, వర్షకాలంలో గొడుగులు అమ్ముతూ డబ్బు సంపాదించానని అన్నారు. ఆ సమయంలో గోకుల్ చాట్ వద్ద పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

కొమరం తన స్టేజ్ పేరు కొమరం అక్క ఎలా వచ్చిందో వివరించారు. మొదట జబర్దస్త్‌లో ఆయన తెలంగాణ స్లాంగ్ కామెడీకి గుర్తింపు తెచ్చుకున్నారు. తన తల్లి కొమరమ్మ పేరును కొమురక్కగా మార్చుకున్నట్లు తెలిపారు. అమ్మ స్థానంలో అక్క అని చేర్చడం ద్వారా సంభాషణలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని కొమరం భావించారు. ఈ పేరు ఆయనకు గుర్తింపు తెచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

వివాహం తర్వాత తన జీవితంలో ఒక కీలక మలుపు వచ్చిందని అన్నారు. ఒక కంపెనీలో రోజుకు 600 బస్తాలు మోసే హమాలీగా కేవలం 4,500 రూపాయల జీతంతో పనిచేశారు. తన భార్య ఇచ్చిన మద్దతు, స్ఫూర్తితోనే తాను సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. ఆమె మూడు సంవత్సరాల గడువు ఇచ్చినా, ఐదేళ్లు ప్రతి నెలా 3,000 రూపాయలను తన అకౌంట్‌కు పంపేవారని, టైలరింగ్ చేస్తూ కొడుకు ఫీజులు కడుతూ కుటుంబాన్ని పోషించారని గుర్తుచేసుకున్నారు. గ్రామస్తులు చేసిన విమర్శలను తన భార్య ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. జబర్దస్త్‌లో అత్యంత ధనవంతుడనే వదంతులపై కొమరం స్పందించారు. తనకు దాదాపు 200 కోట్లు ఆస్తులున్నాయనే వార్తలు నిజం కాదని, తన తండ్రి ఇచ్చిన భూమిలో 2 ఎకరాలు ఐదు ఎకరాలుగా మారిన తర్వాత, తాను సంపాదించిన ప్రతి రూపాయిని భూమి మీదనే పెట్టుబడిగా పెట్టానని, అవి పెరగడం వల్ల ఈ వదంతులు వచ్చాయని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ షోలో గొడవలు, రూమర్స్ ఎక్కువ ఉండడానికి గల కారణాలను వివరించారు. విజయం ఎక్కడ ఉంటే అక్కడ రూమర్స్, గొడవలు సహజమని అన్నారు. తాను ఇప్పటివరకు 42 సినిమాలు చేసినట్లు తెలిపారు. జర్సీ, దసరా వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించినప్పటికీ, ఒక బలమైన, గుర్తుండిపోయే పాత్ర కోసం వేచి ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం పారడైజ్ అనే సినిమాలో మంచి పాత్ర లభించిందని, భవిష్యత్తులో చిరంజీవి సినిమాలో కూడా నటించబోతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

Follow Us