15 ఏళ్ల ప్రేమ.. సరిగ్గా వాలంటైన్స్ డే రోజే కార్లో శవాలుగా కనించిన జంట! అసలు ఏం జరిగిందంటే?
ఢిల్లీ శివార్ల లోని నోయిడాలో ప్రేమికుల రోజున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరంలో శివారులో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కారులో బుల్లెట్ గాయాలతో ఇద్దరు ప్రేమికుల మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం రేపింది. కారులో రివాల్వర్‌ను, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇది ఆత్మహత్యగా అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమికుళ రోజు నాడే ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడా శివారులో వెలుగు చూసింది. నగరం శివారులో పార్క్ చేసిన ఓ కారులో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కారులో ఒక తుపాకీతో పాటు బుల్లెట్‌లు కూడా దొరకడంతో వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతులను నోయిడాకు చెందిన సుమిత్, ఢిల్లీకి చెందిన రేఖగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేముకుల మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. చనిపోయే ముందు వీరిద్దరి మధ్య జరిగిన జరిగిన సంభాషణ వారి మరణానికి గల అసలు కారణాన్ని తెలియజేసింది. వీరిద్దరూ గత 15 ఏళ్లగా ప్రేమించుకుంటున్నారని.. అయితే తాజాగా యువతి ఇంట్లో తెచ్చిన పెళ్లి సంబంధం ఒప్పుకొని మరో యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం కావడంతో.. ప్రియుడు ఆమెను కాల్చి చంపినట్టు తెలుస్తోంది.
ఇక తన ప్రేయసిని హత్య చేసిన తర్వాతన ప్రియుడు కూడా తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి తమ కూతురు కన్పించడం లేదని బాధిత యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో వాళ్లిద్దరి మృతదేహాలు కారులో లభ్యం కావలం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
