AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖలీస్థాన్ ఉగ్రవాది హత్య కేసు కీలక మలుపు.. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గుప్తా..!

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర పన్నిన కేసులో విచారణ పూర్తైంది. భారత పౌరుడు నిఖిల్ గుప్తాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో శిక్షను 2026 మే 29న ప్రకటించనున్నారు. విచారణ సందర్భంగా, మాన్‌హాటన్‌లోని ఫెడరల్ మేజిస్ట్రేట్ ఎదుట నికిల్ గుప్తా నేరాన్ని అంగీకరించాడు.

ఖలీస్థాన్ ఉగ్రవాది హత్య కేసు కీలక మలుపు.. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గుప్తా..!
Gurpatwant Singh Pannun Murder Case
Balaraju Goud
|

Updated on: Feb 14, 2026 | 10:32 AM

Share

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర పన్నిన కేసులో విచారణ పూర్తైంది. భారత పౌరుడు నిఖిల్ గుప్తాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో శిక్షను 2026 మే 29న ప్రకటించనున్నారు. విచారణ సందర్భంగా, మాన్‌హాటన్‌లోని ఫెడరల్ మేజిస్ట్రేట్ ఎదుట నికిల్ గుప్తా నేరాన్ని అంగీకరించాడు. ఈ కోర్టు నిర్ణయం అమెరికా – భారతదేశం మధ్య సంబంధాలపై ఈ కేసు ప్రభావం చూపే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నిఖిల్ గుప్తా నేరం అంగీకారాన్ని అమెరికా ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నును హత్య చేయడానికి జరిగిన కుట్రపై భారతదేశం – అమెరికా మధ్య సంబంధాలు గతంలో దెబ్బతిన్నాయి. చాలా కాలం తర్వాత భారత్ – అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అప్పటి భారత భద్రతా అధికారి దర్శకత్వంలో నిఖిల్ గుప్తా ఈ కుట్రను పన్నాడని కోర్టులో నేరం ఒప్పుకున్నాడు.

అమెరికా కోర్టులో నిఖిల్ గుప్తా చేసిన ఒప్పుకోలు మొత్తం కేసులో ఒక ప్రధాన మలుపు. అందుకే అమెరికా చర్యలను భారతదేశం నిశితంగా పరిశీలిస్తుంది. అమెరికాలో వాంటెడ్‌గా ఉన్న వికాస్ యాదవ్‌ను డిసెంబర్ 18, 2023న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బిఐ కూడా వికాస్ యాదవ్ ఫోటోను విడుదల చేసింది. భారత RAW విభాగానికి చెందిన ఒక అధికారి డైరెక్షన్‌లోనే.. గురుప్రీత్ సింగ్ హత్యకు ప్లానింగ్‌ జరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ హత్య కోసం మొత్తం 1 లక్ష డాలర్లు సుఫారీగా నిర్ణయించారని అధికారులు వెల్లడించారు. అడ్వాన్స్‌గా 15 వేల డాలర్లు చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో శిక్షను 2026 మే 29న ప్రకటించనున్నారు.

న్యూయార్క్ నగరంలో సిక్కు వేర్పాటువాద నాయకుడిని చంపడానికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ వ్యక్తి ఫెడరల్ కోర్టులో మూడు క్రిమినల్ అభియోగాలను అంగీకరించాడు. 54 ఏళ్ల నిఖిల్ గుప్తా హత్య, హత్య కుట్ర, మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అంగీకరించాడు. అతనికి 40 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ అధికారి ఒకరు గుప్తాను ఈ కుట్రను అమలు చేయమని ఆదేశించారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే, పన్నూన్‌ను చంపడానికి జరిగిన కుట్రతో తనకు ఎటువంటి సంబంధం లేదని భారతదేశం ఖండిస్తోంది.

అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఈ విషయంలో కఠిన వైఖరి తీసుకుంటోంది. తమ పౌరులకు హాని కలిగించే ప్రయత్నం చేసే ఎవరినీ అమెరికా వదిలిపెట్టదని FBI అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ నేరస్థులు తరచుగా మాదకద్రవ్యాల నుండి హింసకు మారుతున్నారని DEA (డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్) పేర్కొంది. ఈ కుట్ర సకాలంలో భగ్నం చేశారు.

అమెరికాలో నివసిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక సిక్కు నాయకుడిని హత్య చేయడానికి భారతీయ పౌరుడు ప్రయత్నించాడని అమెరికా ఆరోపించింది. అయితే, అమెరికన్ ఏజెన్సీలు ఈ ప్రణాళిక గురించి ముందుగానే తెలుసుకుని దానిని భగ్నం చేశాయి. నిందితుడు ఇప్పుడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. పన్ను హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ పోలీసులు జూన్ 30, 2023న అరెస్టు చేశారు. ఆ తర్వాత జూన్ 14, 2024న అతన్ని అమెరికాకు అప్పగించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..