అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ.. మరోసారి బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లపై అంక్షలు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండో విడత విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు మరోసారి కొవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి.

అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ.. మరోసారి బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లపై అంక్షలు..!
Follow us
Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Nov 12, 2020 | 10:01 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండో విడత విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు మరోసారి కొవిడ్ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికా దేశంలోని న్యూయార్కు నగరంలో రాత్రి 10 గంటలకు బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు మూసివేయాలని గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్-19 మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా ఇన్ డోర్, అవుట్ డోర్ సమావేశాల్లో 10 మందికి పరిమితం చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణంగా బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లలో అంక్షలు కఠినతరం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా వీటిని రాత్రి 10 గంటలకే మూసివేయాలని కోరారు. నవంబరు 13వతేదీ నుంచి స్టేట్ లిక్కర్ అథారిటీ జారీ చేసిన లైసెన్సులున్న బార్ లతో పాటు జిమ్ లను రాత్రి 10 గంటలకల్లా మూసివేయాలని గవర్నరు ఆదేశించారు.

రెస్టారెంట్లు, బార్ లలో రాత్రి 10 గంటల తర్వాత మద్యం కాకుండా ఆహారం మాత్రం డెలివరీ చేసేందుకు అనుమతించినట్లు క్యూమో వెల్లడించారు. అలాగే కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా బహిరంగ సమావేశాల్లో 10 మందికి పరిమితం చేయాలని, ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించాలని సూచించారు. అవసరమైతే టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించుకోవాలని గవర్నరు కోరారు. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా సంక్రమణ రేటు 3 శాతానికి చేరుకున్న తర్వాత క్యూమో ఈ ప్రకటన చేశారు.