అమెరికా అధ్యక్ష ఫలితాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త దావా !  వచ్చే వారం జార్జియాలో మళ్ళీ ఓట్ల లెక్కింపు

అమెరికా ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ కోర్టులో కొత్తగా దావా వేశారు. మిషిగాన్ లోని కోర్టులో ట్రంప్ ప్రచారవర్గం దావా దాఖలు చేసింది. (2016 లో ఈ రాష్ట్రం నుంచి ట్రంప్ విజయం సాధించారు). 

అమెరికా అధ్యక్ష ఫలితాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త దావా !  వచ్చే వారం జార్జియాలో మళ్ళీ ఓట్ల లెక్కింపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 12, 2020 | 9:06 PM

అమెరికా ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ కోర్టులో కొత్తగా దావా వేశారు. మిషిగాన్ లోని కోర్టులో ట్రంప్ ప్రచారవర్గం దావా దాఖలు చేసింది. (2016 లో ఈ రాష్ట్రం నుంచి ట్రంప్ విజయం సాధించారు).  ఈ సారి ఇక్కడ ఓట్ల లెక్కింపు అనుమానాస్పదంగా ఉందని ట్రంప్ తన దావాలో పేర్కొన్నారు. మిషిగాన్ లో ఈయన జో బైడెన్ కన్నా లక్షా 48 వేల ఓట్లతేడాతో వెనుకబడిఉన్నారు. అయితే జార్జియాలో బైడెన్ కి స్వల్ప ఆధిక్యత లభించింది. కేవలం 14 వేల ఓట్ల లీడ్ లోనే ఉన్నారాయన. ఈ రాష్ట్రంలో మళ్ళీ ఓట్ల లెక్కింపు వచ్ఛేవారం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ నెల 20 కల్లా ఫలితాలు తేలవలసి ఉంది. జార్జియాలో కొంతమంది మృతుల ఓట్లను కూడా లెక్కించారనడానికి తమవద్ద ఆధారాలున్నాయని ట్రంప్ వర్గం చెబుతోంది. కాగా-తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బైడెన్ వచ్ఛే వారం అధికారులతో సమావేశం కానున్నారు. ఆయన జనవరి 20 న  అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.