అప్పుడే పుట్టిన 8మంది శిశువులను చంపిన నర్సు.. మరో 10 మందిని చంపే యత్నం..!

ప్రాణాలు కాపాడాల్సిన ఓ ఆస్పత్రి న‌ర్సు.. అప్పుడే పుట్టిన చిన్నారుల‌ను పసిప్రాయంలోనే చిదిమేసింది.

అప్పుడే పుట్టిన 8మంది శిశువులను చంపిన నర్సు.. మరో 10 మందిని చంపే యత్నం..!
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 12, 2020 | 10:51 AM

ప్రాణాలు కాపాడాల్సిన ఓ ఆస్పత్రి న‌ర్సు.. అప్పుడే పుట్టిన చిన్నారుల‌ను పసిప్రాయంలోనే చిదిమేసింది. ఆమె ప‌నిచేస్తున్న ఆస్పత్రిలోనే ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిదిమంది న‌వ‌జాత శిశువుల‌ ప్రాణాలను తీసింది. మ‌రో ప‌ది మంది చిన్నారుల ప్రాణాల‌ను తీయ‌డానికి ప్ర‌య‌త్నించింది. విషయం వెలుగులోకి రావడంతో సదరు నర్సును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్ట‌ర్న్ ఇంగ్లిష్ సిటీలో ఉన్న ఓ స్థానిక హాస్పిటల్ లో లూసీ లెట్ బే అనే న‌ర్సు ప‌నిచేస్తోంది. ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారుల‌ను చంపేస్తున్న‌ద‌నే అభియోగాల‌పై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2015, జూన్ నుంచి 2016 జూన్ వ‌ర‌కు కౌంటెస్ ఆఫ్‌ చెస్ట‌ర్ హాస్పిటల్స్ లోని నియోన‌ట‌ల్ యూనిట్‌లో ఎనిమి‌ది మంది చిన్నారుల‌ను చంపేసింద‌ని, మ‌రో ప‌ది మంది శిశువులపై హ‌త్యమార్చేందుకు య‌త్నించిందని పోలీసులు తెలిపారు. ఆమెను గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రుచ‌నున్నారు. గ‌తంలో 2018, 2019లోకూడా ఇవే ఆరోప‌ణ‌ల‌పై ఆ న‌ర్సును పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆరోప‌ణ‌లు రుజువుకాక‌పోవ‌డంతో ఆమెను విడుద‌ల చేసింది కోర్టు. తాజాగా మరోసారి పక్కా ఆధారాలతో పోలీసులు కోర్టును ఆశ్రయించడంతో ఇవాళ ఆ నర్సును మేజిస్ట్రేట్ విచారణ జరుపనున్నారు.