AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగిల్స్‌కి పండగే మావా.. గర్ల్‌ఫ్రెండ్ కోసం కష్టపడాల్సిన పనిలేదు.. కానీ కండీషన్స్ అప్లై..

మీరు ఒంటరిగా ఫీలవుతున్నారా..? ఎవరితోనైనా సినిమాకు వెళ్లాలని ఉందా..? లేక మీ పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు పెడుతున్న టార్చర్‌ను తట్టుకోలేకపోతున్నారా..? అయితే మీకోసం ఒక అదిరిపోయే ఆప్షన్.. గంటకు ఇంత అని అమౌంట్ పే చేస్తే చాలు.. ఒక గర్ల్ ఫ్రెండ్ మీతో పాటు వస్తుంది. రెంట్ ఎ గర్ల్‌ఫ్రెండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సింగిల్స్‌కి పండగే మావా.. గర్ల్‌ఫ్రెండ్ కోసం కష్టపడాల్సిన పనిలేదు.. కానీ కండీషన్స్ అప్లై..
Rent A Girlfriend Trend
Krishna S
|

Updated on: Feb 14, 2026 | 7:12 PM

Share

ఈ ఆధునిక ప్రపంచంలో సంబంధాల నిర్వచనం కూడా మారిపోతోంది. ముఖ్యంగా జపాన్, చైనా వంటి దేశాల్లో ఇప్పుడు ఒక వింతైన సేవకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. అదే రెంట్-ఎ-గర్ల్‌ఫ్రెండ్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్కడ ఒక పెద్ద బిజినెస్ మోడల్‌గా మారిపోయింది. దీనికోసం ప్రత్యేకమైన యాప్‌లు, వెబ్‌సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ స్నేహితురాలిని అద్దెకు తీసుకోవడం అంటే కేవలం సరదా కోసం కాదు. ఇందులో ఎలాంటి శారీరక సంబంధాలకు చోటు ఉండదు. కేవలం సామాజిక, భావోద్వేగ అవసరాల కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ కంపెనీలు అమ్మాయిలకు కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ క్రమశిక్షణపై ప్రత్యేక శిక్షణ ఇస్తాయి.

ధర ఎంతంటే..?

అద్దెకు తీసుకున్న స్నేహితురాలితో కలిసి డిన్నర్‌కు వెళ్లడం, సినిమా చూడటం, షాపింగ్ చేయడం లేదా పార్కులో సరదాగా ముచ్చటించడం వంటివి చేయవచ్చు. జపాన్‌లో ఈ సేవలకు డిమాండ్ బట్టి రేట్లు ఉంటాయి.

  • గంటకు – 4,000 నుండి 10,000 యెన్‌లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ. 2,500 నుండి రూ. 6,300 వరకు).
  • రోజుకు – 30,000 నుండి 50,000 యెన్‌ల వరకు ఉంటుంది.
  • అదనపు ఖర్చులు – ప్రయాణ ఖర్చులు, భోజనం బిల్లులు, సినిమా టిక్కెట్ల ఖర్చు క్లయింటే భరించాల్సి ఉంటుంది.

ఎందుకు అద్దెకు తీసుకుంటున్నారు?

దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని సామాజిక నిపుణులు చెబుతున్నారు. బిజీ లైఫ్ వల్ల చాలామంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఎవరితోనైనా మాట్లాడాలని, తమ బాధను పంచుకోవాలని భావించేవారు ఈ సహవాసాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా చైనా, జపాన్ దేశాల్లో యువతపై పెళ్లి చేసుకోమని కుటుంబం నుండి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి, ఈ అద్దె గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకెళ్లి ఫ్యామిలీ ఫంక్షన్లలో పరిచయం చేస్తుంటారు.

నచ్చితేనే..

యూజర్లు యాప్‌లో ఉన్న ప్రొఫైల్స్ చూసి, తమకు నచ్చిన భాష, ఆసక్తులు ఉన్న అమ్మాయిని ఎంచుకోవచ్చు. ఫోటోలు, అలవాట్లు అన్నీ ముందే చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇది వినడానికి వింతగా ఉన్నా, మారుతున్న సామాజిక మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం. భావోద్వేగ మద్దతు కోసం మనుషులు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారని ఈ ట్రెండ్ స్పష్టం చేస్తోంది.