AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నిజం తెలిస్తే నోరెళ్లబెడతారు.. పెళ్లిలో బంగారు బిస్కెట్ల అసలు కథ తెలిస్తే అవాక్కే..

అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు సామాన్యులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. తాజాగా సౌదీ అరేబియాలో జరిగిన ఒక వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పెళ్లికి వచ్చిన అతిథులకు ఏకంగా 24 క్యారెట్ల బంగారు కడ్డీలను బహుమతులుగా పంచుతున్న ఆ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టారు.

Viral Video: నిజం తెలిస్తే నోరెళ్లబెడతారు.. పెళ్లిలో బంగారు బిస్కెట్ల అసలు కథ తెలిస్తే అవాక్కే..
Viral Video Of 24k Gold Bars As Wedding Gifts
Krishna S
|

Updated on: Feb 14, 2026 | 8:56 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రోజుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారింది. తాజాగా సౌదీ అరేబియాలో జరిగిన ఒక వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ వీడియోలో పెళ్లికి వచ్చిన అతిథులకు ఏకంగా 24 క్యారెట్ల బంగారు కడ్డీలను బహుమతులుగా పంచుతున్నట్లు కనిపించడమే దీనికి కారణం. సుమారు 33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఒక వివాహ వేడుకలో పురుషులంతా కూర్చుని ఉండగా.. ఒక వ్యక్తి బంగారు కడ్డీలతో నిండిన పెట్టెను పట్టుకుని వారి మధ్య తిరుగుతూ ఉంటాడు. వధువు సోదరుడు వరుడి కుటుంబ సభ్యులకు ఈ భారీ బంగారు బహుమతులను అందజేస్తున్నాడనే శీర్షికతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు అబ్బో.. ఇది కదా రాయల్ వెడ్డింగ్ అంటే అని ఆశ్చర్యపోగా.. మరికొందరు ఇదంతా షో ఆఫ్ అంటూ పెదవి విరిచారు.

అసలు ట్విస్ట్ ఏంటంటే?

వీడియో చూసిన చాలా మంది అవి నిజమైన బంగారు బిస్కెట్లు అని నమ్మేశారు. కానీ క్షుణ్ణంగా పరిశీలించిన వారికి అసలు విషయం అర్థమైంది. ఆ పెట్టెలో ఉన్నవి నిజమైన బంగారు కడ్డీలు కావు. అవి బంగారు రంగు రేకులో చుట్టిన లగ్జరీ చాక్లెట్లు. మధ్యప్రాచ్య దేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన పాచి అనే ప్రీమియం చాక్లెట్ బ్రాండ్ ఉత్పత్తులుగా వీటిని గుర్తించారు. ఈ బ్రాండ్ తన చాక్లెట్లను బంగారు బిస్కెట్ల ఆకారంలో విలాసవంతమైన ప్యాకింగ్‌లో అందిస్తుంది.

క్లారిటీ ఇచ్చిన నిపుణులు

ఈ వీడియోపై చర్చ పెరగడంతో AI టూల్స్, ఫ్యాక్ట్ చెక్ సంస్థలు స్పందించాయి. ఆ వీడియో సౌదీ వివాహానికి సంబంధించినదే అయినప్పటికీ అందులో ఉన్నవి కేవలం బంగారు కడ్డీలను పోలిన చాక్లెట్లు అని స్పష్టం చేశాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఆ పెట్టె మొత్తం విలువ సుమారు రూ. 4,200 కంటే తక్కువే ఉంటుంది.. బంగారానికి దీనికి సంబంధం లేదు” అని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏదైనా వైరల్ వీడియోను చూసి నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదని ఈ గోల్డ్ బిస్కెట్ ఎపిసోడ్ మనకు గుర్తు చేస్తోంది.