ఢిల్లీలో విజృంభిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 8వేలకు పైగా కేసులు.. 85 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 8,593 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

Delhi corona Cases: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 8,593 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,59,975కు చేరింది. ఇక 24 గంటల్లో 85 మంది మరణించగా.. మృతుల సంఖ్య 7,228కి చేరింది. అలాగే 7,264 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. కోలుకున్న వారి సంఖ్య 4,10,118కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 41,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఢిల్లీలో మూడో వేవ్ ప్రారంభమైనట్లు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. త్వరలోనే కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా దేశంలో చలికాలం ప్రారంభం అవ్వడంతో పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కొనసాగుతోంది.
Read More:
హీరోయిన్ల రెమ్యునరేషన్ లీక్.. కీర్తి పారితోషికం అంతేనా..!
అదుపుతప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఐదుగురికి స్వల్ప గాయాలు
Corona Cases in delhiDelhi Corona CasesDelhi Corona cases updatesDelhi Corona DeathsThird wave in Delhi