ఢిల్లీ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్, హైకోర్టు షాకింగ్ కామెంట్ ! ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలి !

ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభించిందని సాక్షాత్తూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వైరస్ నగరంలో దాదాపు ప్రతి ఇంటిలో కాలూనిందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఢిల్లీ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనావైరస్, హైకోర్టు షాకింగ్ కామెంట్ ! ప్రభుత్వం అలర్ట్ గా ఉండాలి !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 12, 2020 | 9:08 PM

ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభించిందని సాక్షాత్తూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వైరస్ నగరంలో దాదాపు ప్రతి ఇంటిలో కాలూనిందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన సీరో సర్వేను బట్టి ఈ అంచనాకు వచ్చినట్టు న్యాయమూర్తులు హిమకొహ్లీ, సుబ్రమణ్యస్వామిప్రసాద్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. ముఖ్యంగా సెంట్రల్ జిల్లా ఢిల్లీ పరిస్థితి మరీ దారుణంగా ఉందని న్యాయమూర్తులు అన్నారు. నాలుగో దఫా సీరో సర్వే నివేదికను ఓ పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్టు కనిపిస్తోందని బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆంక్షలను ఎందుకు సడలించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.