AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pak Playing XI: ‘స్పెషలిస్ట్’ బౌలింగ్ కాంబోతో బరిలోకి పాకిస్తాన్.. స్టార్ ఆల్ రౌండర్‌కు బిగ్ షాకిచ్చారుగా..?

India vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2026లో అతిపెద్ద మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నాడు భారత్, పాకిస్తాన్ జట్లు కీలక మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోపాటు సూపర్ 8లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది.

Pak Playing XI: 'స్పెషలిస్ట్' బౌలింగ్ కాంబోతో బరిలోకి పాకిస్తాన్.. స్టార్ ఆల్ రౌండర్‌కు బిగ్ షాకిచ్చారుగా..?
Ind Vs Pak Records
Venkata Chari
|

Updated on: Feb 14, 2026 | 8:37 PM

Share

Pak Playing XI: ఆదివారం కొలంబోలో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగే టీ20 ప్రపంచ కప్ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో పాకిస్తాన్ నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. ఇందులో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, స్పెషలిస్ట్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్‌లతో పాటు షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ మీర్జా వంటి ఇద్దరు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో మ్యాచ్‌లోకి వెళ్లాలని ఆసక్తిగా ఉన్నారని జట్టుకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్‌లలో ఒకరిని తొలగించాలని జట్టు యాజమాన్యం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

“జట్టు మేనేజ్‌మెంట్‌కు ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే.. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగితే, ఫహీమ్, షాదాబ్, నవాజ్‌లలో ఎవరు దూరంగా ఉంటారో వారు నిర్ణయించుకోవాలి” అని సంబంధింత వర్గాలు తెలిపాయి.

సైమ్ అయూబ్, సహబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ ఆఘా, బాబర్ అజామ్, ఉస్మాన్ ఖాన్ మొదటి ఐదు స్థానాల్లో ఉండటంతో, ఆరు, ఏడు స్థానాల్లో ఎవరిని ఆడించాలో జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉందని, ఆ తర్వాత నలుగురు బౌలర్లు ఆడాలని ఆయన అన్నారు.

నవాజ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ కావడంతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ వంటి ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ ఉన్నందున అతను జట్టుకు దూరంగా ఉండే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

“ఫహీమ్ మంచి బ్యాటింగ్ ఫామ్‌లో ఉన్నందున, అవసరమైతే మూడవ పేసర్‌గా ఉంటాడు. షాదాబ్ లెగ్ స్పిన్ సౌత్‌పా బ్యాటర్లకు వ్యతిరేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అతన్ని ఆడించడం మంచిదని భావిస్తున్నాను” అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అబ్రార్, ఉస్మాన్, షాదాబ్, సైమ్ అయూబ్ స్పిన్ ఎంపికలుగా అందుబాటులో ఉన్నందున, హై ప్రొఫైల్ మ్యాచ్‌లో నవాజ్ లేకుండానే జట్టు యాజమాన్యం నమ్మకంగా ఉందని ఆయన అన్నారు.

కానీ, ఆదివారం ప్రేమదాస స్టేడియం పిచ్‌ను పూర్తిగా పరిశీలించి, వాతావరణం ఎలా ఉంటుందో చూసిన తర్వాత నిర్ణయం మారవచ్చని తెలుస్తోంది.

ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ కూడా తొలిసారి ప్రేమదాసలో ఆడనుంది.

గత నెలలో శ్రీలంకలో జరిగిన టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ గెలుచుకుంది. కానీ అన్ని మ్యాచ్‌లు దంబుల్లాలో జరిగాయి. అయితే పాక్ జట్టు తన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను నెదర్లాండ్స్ వర్సెస్ USAతో సింహళీస్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఆడింది.

పాకిస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: సయీమ్ అయూబ్, సహబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా ఆఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత్‌లో పెరిగిపోతున్న స్లీప్ డివోర్స్ కేసులు.. అసలు కారణాలు ఇవే
భారత్‌లో పెరిగిపోతున్న స్లీప్ డివోర్స్ కేసులు.. అసలు కారణాలు ఇవే
పరాభవ నామ సంవత్సరం.. ధనస్సు రాశి వారి ఉగాది రాశిఫలాలు!
పరాభవ నామ సంవత్సరం.. ధనస్సు రాశి వారి ఉగాది రాశిఫలాలు!
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మద్యం బ్రాండ్‌ ఇది.. తాగడం ప్రాణాంతకం
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మద్యం బ్రాండ్‌ ఇది.. తాగడం ప్రాణాంతకం
వాడు బ్రహ్మోస్ కంటే డేంజరస్.. అతడి వల్లే కివీస్ ఓటమి
వాడు బ్రహ్మోస్ కంటే డేంజరస్.. అతడి వల్లే కివీస్ ఓటమి
ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!
ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!
అత్యంత అరుదైన ఆపరేషన్.. అతికిన ముక్కలైన చెయ్యి!
అత్యంత అరుదైన ఆపరేషన్.. అతికిన ముక్కలైన చెయ్యి!
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ కన్నింగ్ ప్లాన్.. కట్‌చేస్తే..
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ కన్నింగ్ ప్లాన్.. కట్‌చేస్తే..
LPG గ్యాస్‌ సిలిండర్ల కొరత.. వంట సమయంలో గ్యాస్‌ ఆదా చేసే టిప్స్!
LPG గ్యాస్‌ సిలిండర్ల కొరత.. వంట సమయంలో గ్యాస్‌ ఆదా చేసే టిప్స్!
తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో మరో 4లైన్ హైవే!
తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో మరో 4లైన్ హైవే!
సంజూ శాంసన్ కెరీర్‌నే మార్చేసిన 25 నిమిషాలు.. అదేంటంటే?
సంజూ శాంసన్ కెరీర్‌నే మార్చేసిన 25 నిమిషాలు.. అదేంటంటే?