AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagyaraj: చనిపోయినా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన భాగ్యరాజ్.. కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచిన నటుడు

గుండెపోటుతో 73 ఏళ్ల వయసులో కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్, తన చివరి కోరిక ప్రకారం ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నింపారు. ఈ మేరకు వైద్యులు భాగ్యరాజ్ ఇంటికి చేరుకుని నేత్ర దానం ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Bhagyaraj: చనిపోయినా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన భాగ్యరాజ్.. కళ్లను దానం చేసి ఆదర్శంగా నిలిచిన నటుడు
K Bhagyaraj
Basha Shek
|

Updated on: Jun 28, 2026 | 3:58 PM

Share

తమిళ సినిమా దర్శకుడు, నటుడు, స్క్రీన్ రైటర్ కె. భాగ్యరాజ్ (73) శనివారం (జూన్ 27 ) చెన్నైలో తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన నటనతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘స్క్రీన్ ప్లే కింగ్’ గా గా గుర్తింపు పొందిన భాగ్యరాజ్ మరణం చిత్ర పరిశ్రమకు అలాగే కోట్లాది మంది అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సీఎం విజయ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు భాగ్యరాజ్ ఇంటికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించాడు. నటుడితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరణానంతరం కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు భాగ్యరాజ్. ఆయన కన్నుమూసిన కొన్ని గంటల్లోనే కుటుంబ సభ్యులు భాగ్యరాజ్ నేత్రాలను దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు దశాబ్దాల క్రితమే తాను మరణించిన తర్వాత కళ్లు దానం చేస్తానని భాగ్యరాజ్ ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటను నిలబెడుతూ ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ప్రముఖ కంటి ఆసుపత్రికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే నిపుణులైన వైద్యుల బృందం భాగ్యరాజ్ నివాసానికి చేరుకుని, నిర్దేశిత సమయంలోగా ఆయన నేత్రాలను అత్యంత భద్రంగా సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భాగ్యరాజ్ రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.

కాగా భాగ్యరాజ్ నివాసానికి వెళ్లి తుది నివాళులర్పించిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. ‘కె. భాగ్యరాజ్‌కు తుది నివాళులర్పించడానికి వెళ్ళినప్పుడు, ఆయన తన కళ్లను దానం చేశారని నాకు తెలిసింది. మరణానంతరం కూడా ఒకరి జీవితంలో వెలుగులు నింపాలనే ఆయన ఆలోచనను ఎంత పొగిడినా తక్కువే. ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన ఇంతటి ప్రముఖులు తమ కళ్లను దానం చేసినప్పుడు, అది ప్రజలలో గొప్ప అవగాహనను కల్పిస్తుంది’ అని నటుడికి నివాళి అర్పించారు తమిళి సై.

ఇవి కూడా చదవండి

కాగా భాగ్యరాజ్‌కు భార్య పూర్ణిమ, కుమార్తెలు శరణ్య, శాంతను ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే భాగ్యరాజ్ గురువు, ఆప్తమిత్రుడైన దర్శకుడు కె. భారతిరాజ్ కన్నుమూశారు. ఆ బాధ నుంచి తేరుకోకముందే భాగ్యరాజ్ మరణించడం తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

భాగ్యరాజ్ పాడే మోస్తోన్న పార్తీబన్, శరత్ కుమార్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us