AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన ఘనత.. సెషెల్స్ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కారం..

పర్యావరణ పరిరక్షణలో విశేష కృషికి గాను ప్రధాని నరేంద్ర మోదీకి సెషెల్స్ దేశ అత్యున్నత అధ్యక్ష పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్' లభించింది. ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా మోదీ నిలిచారు. బ్లూ ఎకానమీ, వాతావరణ మార్పులపై పోరాటం, పర్యావరణ హిత కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని సెషెల్స్ ప్రభుత్వం ప్రదానం చేసింది.

PM Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన ఘనత.. సెషెల్స్ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కారం..
PM Modi receives Seychelles' highest environmental honour
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 28, 2026 | 4:34 PM

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన విశేష కృషికి గాను సెషెల్స్ దేశం తమ అత్యున్నత అధ్యక్ష పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ తో ప్రధాని మోదీని గౌరవించింది. సెషెల్స్ రాజధాని విక్టోరియాలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఈ అవార్డును ప్రధానమంత్రికి అందజేశారు. ఈ విశిష్ట పురస్కారాన్ని ఒకరికి అందజేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ పురస్కారం ఎందుకంటే..

అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడటంతో పాటు, గ్లోబల్ గ్రీన్ లీడర్‌షిప్‌లో ప్రధాని మోదీ చూపిన చొరవకు గాను ఈ పురస్కారం లభించింది. బ్లూ ఎకానమీ (సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ), సముద్ర వనరుల స్థిరమైన నిర్వహణ, పర్యావరణ అనుకూల అభివృద్ధిని ప్రోత్సహించడం, వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన చర్యలు చేపట్టడం, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ (SIDS) ఆకాంక్షలకు వారి ప్రయోజనాలకు నిరంతరం మద్దతుగా నిలవడంతో ప్రధాని మోడీకి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన పలు పర్యావరణ కార్యక్రమాలు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యక్రమాలను సెషెల్స్ ప్రభుత్వం కొనియాడింది.

ప్రపంచ పర్యావరణ ప్రేమికులకు అవార్డును అంకితం చేసిన ప్రధాని మోడీ..

సెషెల్స్ దేశ అత్యున్నత అధ్యక్ష పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అందుకున్న అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని వాతావరణ మార్పులపై పోరాడుతూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ప్రపంచ దేశాలన్నింటికీ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. తనకు గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అనే పురస్కారం ఇచ్చినందుకు, సెయిషెల్స్ ప్రజలకు, ప్రభుత్వానికి, అలాగే అధ్యక్షురాలు హెర్మినికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు..ఇది మనం అందరం కలిసి అధిగమించాల్సిన అత్యవసరమైన సవాలుగా పేర్కొన్నారు. మన గ్రహాన్ని మరింత పచ్చగా, సుస్థిరంగా మార్చడానికి అవసరమైనది ఏదైనా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. భారత్-సెషెల్స్ దౌత్య సంబంధాలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ పురస్కారం దక్కడం ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలోనూ అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న మోదీ..

సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించినందుకు గాను ప్రధాని మోదీకి గతంలో ఐక్యరాజ్యసమితి (UN) ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు, ఎఫ్‌ఏఓ వారి అగ్రికోలా మెడల్, సియోల్ శాంతి బహుమతి.. సరసన ఇప్పుడు సెషెల్స్ దేశపు గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ పురస్కారం చేరింది. భారత మహాసముద్ర ప్రాంతంలో సామర్థ్య పెంపుదల, పర్యావరణ పరిరక్షణ చర్యలు, భాగస్వామ్య అభివృద్ధి కార్యక్రమాలలో భారతదేశాన్ని ఒక నమ్మకమైన భాగస్వామిగా సెషెల్స్ ఎంతగా గౌరవిస్తుందో ఈ పురస్కారం స్పష్టం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!
ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..
న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..
న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..
వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?
వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?
జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పూజ చేస్తే శుభయోగాలు, ఐశ్వర్యం మీ సొంతం!
జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పూజ చేస్తే శుభయోగాలు, ఐశ్వర్యం మీ సొంతం!
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్! పెద్దలకు మాత్రమే
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్! పెద్దలకు మాత్రమే
నల్లతాచుతో మొసలి భీకర పోరాటం.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో చూస్తారా?
నల్లతాచుతో మొసలి భీకర పోరాటం.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో చూస్తారా?
ఆదివారం ఈ 3 శుభ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే మీ అదృష్టం..
ఆదివారం ఈ 3 శుభ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే మీ అదృష్టం..