కరోనా ఇండియా అప్‌డేట్ : కాస్త ఊరట, తగ్గిన యాక్టీవ్ కేసులు..వాక్సీన్ వచ్చేది ఎప్పుడు ?
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 47,905 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. మరో 550 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 47,905 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. మరో 550 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 86,83,917కు చేరింది. మరణాల సంఖ్య 1,28,121గా ఉంది. బుధవానం దేశ వ్యాప్తంగా 52,718 మంది కోలుకోగా ఇప్పటి వరకు 80,66,502 మంది డిశ్చార్జి అయ్యారు. వరుసగా రెండో రోజు యాక్టీవ్ కేసుల సంఖ్య 5 లక్షలకు దిగువన నమోదైంది. దేశంలో ప్రస్తుతం 4,89,294 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. బుధవారం 11,93,358 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 12,19,62,509కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 92.89గా ఉండగా..డెత్ రేటు 1.48గా ఉంది.
Also Read :
నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !
Alert : ఏపీకి భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఆ జిల్లాలకు
డెలివరీ చేసిన నర్సులు, ఆయాలు.. మగశిశువు మృతి !