AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ టూ వైజాగ్.. 28 నిమిషాల్లోనే ప్రయాణం.. రయ్‌ రయ్‌మంటూ

చైనా మాగ్లేవ్ టెక్నాలజీతో పనిచేసే సూపర్‌సోనిక్ రైలును అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ రైలు కేవలం 30 నిమిషాల్లో 700 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించగలదు. హైదరాబాద్ నుంచి వైజాగ్ కేవలం 28 నిమిషాల్లో చేరుకోవడం లాంటి అద్భుతాలను ఇది నిజం చేయనుంది.

Hyderabad: హైదరాబాద్ టూ వైజాగ్.. 28 నిమిషాల్లోనే ప్రయాణం.. రయ్‌ రయ్‌మంటూ
Secunderabad
Ravi Kiran
|

Updated on: Feb 14, 2026 | 8:48 PM

Share

రైలు ప్రయాణంలో ప్రపంచం మునుపెన్నడూ చూడని విప్లవానికి చైనా నాంది పలుకుతోంది. ఇప్పటికే గంటకు 501 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మాగ్లేవ్ రైళ్లతో రికార్డులు సృష్టిస్తున్న చైనా, ఇప్పుడు ఏకంగా శబ్ద వేగాన్ని ఛేదించే సూపర్‌సోనిక్ రైలును సిద్ధం చేస్తోంది. ఈ అద్భుతమైన రైలు పట్టాలెక్కితే కేవలం 30 నిమిషాల్లో 700 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించవచ్చు. ఇది ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై నిరంతరం పనిచేస్తున్నారు. ఈ సూపర్‌సోనిక్ రైలులో ఉపయోగించే ముఖ్యమైన సాంకేతికత విద్యుదయస్కాంత స్లెడ్జ్ వ్యవస్థ. 2023లో జరిగిన ప్రయోగాల్లో, శాస్త్రవేత్తలు ఒక టన్ను బరువున్న వాహనాన్ని విజయవంతంగా మాక్ 1 వేగంతో పంపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ విజయం భవిష్యత్ సూపర్‌సోనిక్ ప్రయాణానికి బలమైన పునాది వేసింది.

అంత వేగంతో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే అతి పెద్ద సమస్య షాక్ వేవ్స్. దీనివల్ల రైలు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ క్లిష్టమైన సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఒక వినూత్న మార్గాన్ని కనిపెట్టారు. సాధారణ సెన్సార్లు సూపర్‌సోనిక్ వేగం వద్ద విఫలమవుతుండడంతో, విద్యుత్ సరఫరాలో వచ్చే సూక్ష్మ మార్పులను వినడం ద్వారా వేగాన్ని ఖచ్చితత్వంతో అంచనా వేసేలా ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ సూపర్‌సోనిక్ వేగాన్ని మన దేశ పరిస్థితులతో పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం కాశీ నుంచి మధుర పుణ్యక్షేత్రాల మధ్య 713 కిలోమీటర్ల దూరాన్ని రైల్లో ప్రయాణించాలంటే కనీసం 11 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా, హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం 28 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అంటే విమానం కంటే కూడా వేగంగా ప్రయాణించవచ్చన్నమాట. ఇది మన దేశంలో ప్రయాణ సమయాన్ని విపరీతంగా తగ్గించి, ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమివ్వగలదు.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ప్రయోగ దశలో ఉన్నప్పటికీ, చైనా శాస్త్రవేత్తలు సాధిస్తున్న పురోగతి చూస్తుంటే భవిష్యత్తులో భూమిపై ప్రయాణం అంతరిక్ష యానంలా వేగంగా మారబోతోందని అర్థమవుతోంది. అయితే, విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు రైలును సురక్షితంగా ఆపడం వంటి కొన్ని చిన్న చిన్న సాంకేతిక లోపాలను సరిదిద్దే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు. ఈ సవాళ్లను అధిగమిస్తే, మానవ ప్రయాణంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కావడం ఖాయం.