Pakistan: ఆఫ్గాన్ నిరాశ్రయులపై పైశాచికంగా ప్రవర్తిస్తున్న పాక్.. కారణాలేంటి..?
ప్రపంచంలో ఎవరు ఏ దేశంలో అయినా బ్రతకవచ్చు. ప్రయాణం చేయవచ్చు, స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఎక్కడికైతే వెళ్లాలనుకుంటున్నామో ఆ దేశ అనుమతులు తప్పని సరి. ఇవి కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి. పరిస్థితిని బట్టీ కొన్ని సడలింపులు ఇస్తాయి ప్రపంచ దేశాలు. అందులో భాగంగా గతంలో జరిగిన ఆఫ్గాన్ మారణహోమం కారణంగా పాకిస్తాన్‌లోకి వలస వెళ్లారు. ఆఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బతకలేక పాకిస్తాన్‌కి వలస వచ్చిన

ప్రపంచంలో ఎవరు ఏ దేశంలో అయినా బ్రతకవచ్చు. ప్రయాణం చేయవచ్చు, స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఎక్కడికైతే వెళ్లాలనుకుంటున్నామో ఆ దేశ అనుమతులు తప్పని సరి. ఇవి కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటాయి. పరిస్థితిని బట్టీ కొన్ని సడలింపులు ఇస్తాయి ప్రపంచ దేశాలు. అందులో భాగంగా గతంలో జరిగిన ఆఫ్గాన్ మారణహోమం కారణంగా పాకిస్తాన్‌లోకి వలస వెళ్లారు. ఆఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బతకలేక పాకిస్తాన్‌కి వలస వచ్చిన వారిని నిర్థాక్షిణ్యంగా దోచుకుంటోంది పాకిస్థాన్. అసలే శరణార్థులు అనే ఇంకితం మరిచి ప్రవర్తిస్తోంది. ఆఫ్గాన్లను దోచుకోవడం ఏంటని పాకిస్తాన్‌పై తాలిబన్లు మండిపడుతున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో ఒకప్పడి పరిస్థితులకు అమెరికా దళాలు రక్షణగా నిలిచాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవడంతో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు. దీంతో చాలా మంది ఆఫ్గాన్ల ఆశలు అడియాసలు అయ్యాయి.
ఆ టైమ్‌లో అమెరికా సహా ఇతర దేశాలు ఏర్పాటు చేసిన విమానాల్లో ఎక్కడికో ఒక చోటకు వెళ్ళేందుకు చాలా మంది పోటీపడ్డారు. ఇప్పటికే కాదు ఎప్పటికీ అలాంటి అమానవీయమైన సంఘటనలు మర్చిపోలేం. కొందరు విమానం బయట రెక్కలు పట్టుకొని ప్రయాణం సాగిస్తూ సగం దూరంలోనే సముద్రంలో పడిపోయిన సందర్భాలు ప్రపంచంలో అందరికీ కళ్లు చెమర్చేలా చేశాయి. యావత్ ప్రపంచం ఈ ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్ నుంచి విదేశాలకు ఎలాంటి రాకపోకలు లేవు. దాంతో చాలామంది తినడానికి తిండిలేక పొరుగునే ఉన్న పాకిస్తాన్‌కు పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లారు. ఏ పని దొరికితే ఆ పని చేనసుకొని బ్రతికేందుకు సిద్దమయ్యారు. కొందరు అడుక్కొని కూడా జీవనం సాగిస్తున్నారు. గతంలో చితికిన బతులకును ఇప్పుడిప్పుడే చిగురించుకునేలా చేసుకుంటున్నారు ఆఫ్గాన్లు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇలా శరణార్థులుగా వచ్చిన వాళ్ళందర్నీ తిరిగి మీ దేశానికి తీసుకుపోండని తాలిబన్లకు డెడ్ లైన్ పెట్టింది పాకిస్తాన్. దీంతో ఇరుదేశాల మధ్య పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు కారణం అవుతోంది.
ఏదో చిన్నపాటి పని చేసుకుంటూ పాకిస్తాన్‌లో బతుకుతున్న ఆఫ్గానిస్తాన్ ప్రజలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మీరు వెళ్లకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తామని హెచ్చిరించింది. ఈ క్రమంలోనే తాలిబన్లకు, పాకిస్తాన్ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో పాకిస్తాన్‌లో ఉన్న ఆఫ్గాన్ శరణార్థులను పాక్ పోలీసులతో పాటూ అధికారులు క్రూరాతి క్రూరంగా హింసిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్రతుకు జీవుడా అని వలస వచ్చిన వారి దగ్గర ఉన్న వ్యక్తిగత వస్తువులను పాకిస్తాన్ దోచుకుంటోందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న ఇళ్ళను ధ్వంసం చేస్తూ కనీస అవసరాల్లో ఒకటైన గూడు లేకుండా చేస్తోంది పాకిస్తాన్. దీనిపై తాలిబన్ ప్రభుత్వంలోని మంత్రి స్పందించారు. ఆఫ్గాన్ శరణార్థులపై ఇలా అమానుషంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు మరోసారి పునవావృతం అయితే పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం ఆఫ్గాన్ నుంచి వలస వచ్చిన శరణార్థులు 20 లక్షల మందికి పైగా ఉన్నారని తెలుస్తోంది. వీళ్ళందర్నీ దేశం నుంచి పంపేస్తామని పాకిస్తాన్ చెబుతోంది. దీనికి కారణం పాకిస్తాన్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం అని అంటున్నారు నిపుణులు. దీనిపై ఆఫ్గనిస్తాన్ ప్రధాని ముల్లా మహ్మద్ హస్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక వేళ అలా పంపితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళంతట వాళ్ళు తమ పరిస్థితి చక్కబడి తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయేదుకు కొంత టైమ్ ఇవ్వాలనీ.. అంతవరకూ వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. మీరు పొరుగునే ఉన్నారు.. మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలని పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
ఆఫ్గానిస్థాన్‌కి జరిగిన అమానుష ఘటనలపై ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్‌లో ఉన్న ఆఫ్గాన్ బాధితులను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. అయితే పాకిస్తాన్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. ఆ దేశం ఆర్థిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆఫ్గాన్ శరణార్థులకు పాక్ ను విడిచి వెళ్ళాలని అక్టోబర్ 31 వరకూ డెడ్ లైన్ పెట్టింది. ఆ లోగా వెళ్ళకపోతే.. 20 లక్షల మందిని నిర్ధాక్షణ్యంగా పంపేస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆఫ్గాన్ శరణార్థులకు.. పాకిస్థాన్ పాలకులకు మధ్య పరస్పర బెదిరింపులు, వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. గడిచిన 2 వారాలుగా వెయ్యి మందికిపైగా ఆఫ్గన్లను నిర్భందించినట్లు పాక్‌లోని ఆఫ్గన్ రాయబార కార్యాలయం తన ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. నవంబర్ 1వ తేదీ నుంచి పాక్‌లోకి ప్రవేశించే ఆఫ్గన్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తూ.. వీసా, పాస్‌పోర్టు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ పరిస్థితులు ఎక్కడ ఉద్రిక్తతలకు దారి తీస్తాయో అని భయపడుతున్నారు ఆఫ్గా్న్ వాసులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి