Great Train Robbery: ‘గ్రేట్ ట్రైన్ రాబరీ’ ఎందుకంత సంచలనం సృష్టించింది.? వీడియో
సరిగ్గా 60 ఏళ్ల క్రితం.. 1963లో 15 మంది దొంగల ముఠా లండన్‌లో ఒక రైలును హైజాక్ చేసి.. 30 నిమిషాల్లో రూ.500 కోట్లు దోచుకెళ్లింది. తాజాగా ఆ ముఠాలోని చివరి వ్యక్తి బాబీ వెల్చ్ మృతి చెందాడు. దాంతో ‘గ్రేట్ ట్రైన్ రాబరీ’ స్టోరీ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఉత్తర లండన్‌లోని బ్రిడెగో బ్రిడ్జ్ సమీపంలో పెద్ద మొత్తంలో క్యాష్‌తో వెళ్తోన్న గ్లాస్గో-లండన్ రాయల్ మెయిల్ ట్రైన్ హైజాక్ అయ్యింది.
సరిగ్గా 60 ఏళ్ల క్రితం.. 1963లో 15 మంది దొంగల ముఠా లండన్‌లో ఒక రైలును హైజాక్ చేసి.. 30 నిమిషాల్లో రూ.500 కోట్లు దోచుకెళ్లింది. తాజాగా ఆ ముఠాలోని చివరి వ్యక్తి బాబీ వెల్చ్ మృతి చెందాడు. దాంతో ‘గ్రేట్ ట్రైన్ రాబరీ’ స్టోరీ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఉత్తర లండన్‌లోని బ్రిడెగో బ్రిడ్జ్ సమీపంలో పెద్ద మొత్తంలో క్యాష్‌తో వెళ్తోన్న గ్లాస్గో-లండన్ రాయల్ మెయిల్ ట్రైన్ హైజాక్ అయ్యింది. నగదు గురించి ముందస్తు సమాచారం ఉన్న 15 మంది ఒక ముఠాగా ఏర్పడి.. భారీ దోపిడీకి ప్లాన్ వేశారు. వారు ముందుగా రైలు సిగ్నల్ వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. లైన్ సైడ్ సిగ్నల్‌ను ట్యాంపర్ చేసి, రైలు ఆగిపోయేలా చేశారు. ముసుగులు, గ్లౌజులు ధరించి, 150 గోనె సంచులతో రైలులోకి ప్రవేశించారు. ముందు రైలు లోకో పైలెట్, కో పైలెట్‌పై దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత దొంగలు 2.6 మిలియన్ పౌండ్లను దోచేశారు. ప్రస్తుత విలువ ప్రకారం ఆ మొత్తం రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆ మొత్తాన్ని ల్యాండ్ రోవర్ కార్లలో కొద్దిరోజుల ముందే కొనుగోలు చేసిన ఒక ఫాంహౌస్‌కు తరలించారు. అక్కడే దానిని వాటాలు పంచుకున్నారు. తర్వాత ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఆ ఫాంహౌస్‌ను కాల్చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆరుగురు వ్యక్తుల్ని నియమించి ఆ పనిని అప్పగించారు. సరిగ్గా ఇక్కడే వారి ప్లాన్ బెడిసి కొట్టింది. ఫౌంహౌస్ పూర్తిగా కాలిపోకపోవడంతో పోలీసులకు కొన్ని వేలిముద్రలు దొరికాయి. వాటి సహాయంతో 12 మందిని అరెస్టు చేసి, జైలుకు పంపారు. దోపిడీ ముఠాలో చివరి వ్యక్తి అయిన బాబీ వెల్చ్ ఈమధ్యనే మరణించాడు. వయోభారం పెరిగి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులు కూడా మరణించారు. ఇదిలా ఉంటే.. పోలీసులు దొంగల్ని పట్టుకున్నప్పటికీ, దోపిడీకి గురైన సొత్తులో చాలా వరకు తిరిగి స్వాధీనం చేసుకోలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.