India-Pakistan: బూమ్.. పాకిస్తాన్ ఆటంబాంబ్ మటాష్..! ఆ థ్యాంక్స్ వెనక.. అణువంత రహస్యం..
ఆ నవ్వుల వెనక ఇంకేదో అర్ధం ఉన్నట్టు తెలియడం లేదూ..! అంతా ఆ నవ్వులనే డీకోడ్ చేస్తున్నారు.. ఏమై ఉంటుందా అని. పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌పై దాడి చేశారట కదా.. ఆ కొండల కింద భూగర్భంలో ఉన్న పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ దెబ్బతిన్నాయట కదా అని ఓ జర్నలిస్ట్ ఏకే భారతీని అడిగారు. నిప్పు లేనిదే పొగ రాదు. సో, పాకిస్తాన్‌కు నష్టం జరగనిదే ఇలాంటి ప్రశ్న రాదు. కాని, ఆ ప్రశ్న వచ్చిందంటే అర్ధం.. ఆ ముసిముసి నవ్వు నిజమేనని.

సీజ్‌ఫైర్‌కు కొన్ని గంటల ముందు.. పాకిస్తాన్‌కు అతి కీలకమైన నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై మన మిస్సైల్స్ దాడి చేశాయి. బెదిరిపోయిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. మూడు గంటల పాటు బంకర్‌లోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ దాక్కున్నాడు. కాస్త తేరుకున్న తరువాత.. ఏం జరిగిందో అర్ధమైంది. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న వేళ.. పాకిస్తాన్‌లో భూకంపం వచ్చిందని ఓ వార్త వచ్చింది. గుర్తుందా..! ప్రకృతి కూడా పాక్‌పై పగబట్టిందని వార్తలు వచ్చాయ్ ఆ టైమ్‌లో. బట్.. ఆ భూకంపం ప్రకృతి చేసింది కాదూ.. ఇండియన్ ఆర్మీ మిస్సైల్ దాడి వల్లే అనేది ఓ వాదన. పాకిస్తాన్‌లోని అమెరికా సీక్రెట్ ఏజెంట్స్‌కు విషయం ఏంటో తెలిసిపోయింది. భారత్ కొట్టింది మామూలు దెబ్బ కాదు అని అర్థమైంది. అనుకున్నట్టే.. పాక్ ప్రధాని షరీఫ్ అమెరికాకు కాల్ చేశారు. కాల్పులు ఆపమని మోదీని ఒప్పించకపోతే గనక పాక్ పుట్టి మునుగుతుందని ప్రాథేయపడ్డాడు. ఇదీ కాల్పుల విరమణకు కొన్ని గంటల ముందు జరిగిన మ్యాటర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? అసలు మ్యాటర్ ఏంటంటే.. పాకిస్తాన్ దాచుకున్న అణుబాంబులు పనికిరాకుండా పోయాయ్. ఏంటి.. ఇండియాపై వేయడానికి తమకూ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని ప్రగల్భాలు పలికింది చూశారా.. వాటినే ధ్వంసం చేసొచ్చింది ఇండియన్ ఆర్మీ. మరొక్కసారి ఎయిర్ మార్షల్ ఏకే భారతీ కామెంట్స్ చూడండి.. ఆ నవ్వుల వెనక ఇంకేదో అర్ధం ఉన్నట్టు తెలియడం లేదూ..! అంతా ఆ నవ్వులనే డీకోడ్ చేస్తున్నారు.. ఏమై ఉంటుందా అని....
