కరాచీలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి, అంతకంతకూ పెరగుుతున్న మృతులు!
పాకిస్తాన్‌లోని కరాచీలోని ఒక షాపింగ్ మాల్‌లో శనివారం రాత్రి (జనవరి 17, 2026) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. వారిలో ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగి 12 గంటలకు పైగా గడిచినా, కొంతమంది ఇప్పటికీ భవనంలో చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

పాకిస్తాన్‌లోని కరాచీలోని ఒక షాపింగ్ మాల్‌లో శనివారం రాత్రి (జనవరి 17, 2026) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. వారిలో ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగి 12 గంటలకు పైగా గడిచినా, కొంతమంది ఇప్పటికీ భవనంలో చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. వారిని రక్షించడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు.
కరాచీలోని రద్దీగా ఉండే ఎంఏ జిన్నా రోడ్డులో ఉన్న బహుళ అంతస్తుల షాపింగ్ మాల్ గుల్ ప్లాజాలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ సహాయక చర్యలు ఆదివారం (జనవరి 18, 2026) కూడా కొనసాగాయి. ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. చనిపోయినవారిని గుర్తించాల్సి ఉందన్నారు. మరోవైపు ఇప్పటికీ భవనంలో చాలా మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇక ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
