AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ ఎఫెక్ట్.. పాకిస్తాన్ స్టాక్‌మార్కెట్‌లో నిలిచిన ట్రేడింగ్!

భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యలు చేపట్టడంతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ భారీగా నష్టపోయింది. వాణిజ్య సంబంధాల రద్దు, దిగుమతులపై పరిమితులు వంటి చర్యలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేశాయి.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ ఎఫెక్ట్.. పాకిస్తాన్ స్టాక్‌మార్కెట్‌లో నిలిచిన ట్రేడింగ్!
Anand T
|

Updated on: May 08, 2025 | 3:41 PM

Share

పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు చేసిన ఒక్క తప్పు ఇప్పుడు తమ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలా చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారి తీశాయి. పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్ సిందూర్ చేపట్టి..పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇంతకు ముందే పాక్‌తో ఉన్న వాణిజ్య సంబంధాలను భారత్ రద్దు చేసింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడడంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుదేల్‌ అయిపోయాయి.

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడుల చేసిన తర్వాత ఆ దేశంలోని కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పాకిస్తాన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE-30 ఏకంగా 7200 పాయింట్ల మేర పడిపోయింది. దీంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ నిలిపేసింది. కరాచీ, లాహోర్‌లో సహా పలు ప్రాంతాల్లో పేళ్లుల్లు తర్వాత మార్కెట్ ఈ పరిస్థికి చేరింది. బుధవారం కూడా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు 3 శాతం పైగా పడిపోయాయినట్టు తెలుస్తోంది.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ చాలా వరకు దెబ్బతిన్నాయి. పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్‌ నుంచి చేసుకునే దిగుమతులు, ఓడలు పోస్టల్ డెలివరీలపై పరిమితులు విధించడం వంటి నిర్ణయాలు పాకిస్తాన్ మార్కెట్లలో పెట్టుబడిదారులను కలవరపెట్టాయి. అయితే తాజాగా భారత్ బలగాలు పాక్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్తావరాలపై దాడి చేయడంతో పాక్ స్టాక్‌ మార్కెట్‌పై మరింత ప్రభావాన్ని చూపింది. మూడీస్ అంచనా ప్రకారం, పెరుగుతున్న ద్వైపాక్షిక ఉద్రిక్తతలు భారతదేశం కంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయ తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్