ఆరు మాసాల తర్వాత ఆ దేశంలో ఒకే ఒక్క కరోనా కేసు.. దేశ వ్యాప్తంగా 3 రోజుల లాక్ డౌన్..

ఆరు మాసాల తర్వాత ఆ దేశంలో ఒకే ఒక్క కరోనా కేసు.. దేశ వ్యాప్తంగా 3 రోజుల లాక్ డౌన్..
One Corona Case In Newzealand

ఆ దేశంలో 6 నెలల తరువాత ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. దీంతో దేశ వ్యాప్తంగా మూడు రోజుల లాక్ డౌన్ విధించారు. పూర్తి వివరాలు ఏంటో తెలుసుకోండి

Umakanth Rao

| Edited By: Janardhan Veluru

Aug 17, 2021 | 6:17 PM

న్యూజిలాండ్‌లో మళ్లీ దేశ వ్యాప్తంగా మూడ్రోజుల లాక్‌డౌన్ విధించారు. గత ఫిబ్రవరి నుంచి ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. తాజాగా 6 నెలల తరువాత ఓ కేసు నమోదైంది. దీంతో దేశ ప్రధాని జసిండా అర్డర్న్ 3 రోజుల దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించారు. ఆక్లాండ్ లో నమోదైన ఈ ఒక్క కేసు కోసం.. ఆ వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు హుటాహుటిన ఆ నగరానికి బయల్దేరారు. తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని జసిండా చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మూడు రోజుల లాక్ డౌన్ ప్రారంభమవుతుందన్నారు . ఇది డెల్టా వేరియంట్ కేసు అని గేమ్ చెంజర్ అని ఆమె వ్యాఖ్యానించారు., తక్షణమే ఈ మహమ్మారి నుంచి బయటపడాల్సి ఉందని అన్నారు. ఈ నెల 12 న ఆక్లాండ్ లో 50 ఏళ్ళ వ్యక్తికి ఈ వైరస్ సోకింది. అంతే.. ఈ సమాచారం తెలియగానే ప్రభుత్వం ఆగమేఘాల మీద ఇక ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. లైట్ అండ్ లాంగ్ అన్నది తమ ప్రభుత్వ విధానం కాదని, దీని బదులు షార్ట్ అండ్ హార్డ్ అన్నదే తమ పంథా అని జసిండా పేర్కొన్నారు.

న్యూజిలాండ్ ను చూసి ఇతర దేశాలు కూడా ఇలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రధాని స్పందన మాదిరే ఇతర ప్రభుత్వాలు కూడా స్పందించాలని,, వారు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఈ చిన్నారి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో గెస్ చెయ్యగలరా ..?:Celebrity Baby Picture Video.

 గుండు చేయించుకొని మరి రజినీకాంత్ ని పెళ్ళికి ఒప్పించింది… తలైవా పెళ్లికి ట్వీస్ట్‌లు మీద ట్వీస్ట్‌లు:Rajinikanth Love story video.

 బైక్ నడుపుతూ.. ఇదేం ఓవర్ యాక్షన్ రా బాబు !అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటారు..:Bike Viral Video.

 జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu