తాలిబాన్లకు లొంగే ప్రసక్తి లేదు.. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్..
తాలిబన్లకు తాను తలవంచే ప్రసక్తే లేదని ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్ధుడు అమ్రుల్లా సలెహ్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ టెర్రరిస్టులకు శిరసు వంచే ప్రసక్తే ఉండదని.. తన ఆఫ్ఘన్ గడ్డకు ద్రోహం చేయజాలనని ఆయన ట్వీట్ చేసారు.
తాలిబన్లకు తాను తలవంచే ప్రసక్తే లేదని ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్ధుడు అమ్రుల్లా సలెహ్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ టెర్రరిస్టులకు శిరసు వంచే ప్రసక్తే ఉండదని.. తన ఆఫ్ఘన్ గడ్డకు ద్రోహం చేయజాలనని ఆయన ట్వీట్ చేసారు. తనను ఆదరించిన లక్షలాది ప్రజలను తాను అసంతృప్తికి గురి చేయబోనన్నారు. ఆఫ్ఘన్ లో రక్తపాతాన్ని నివారించేందుకు అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కాబూల్ నుంచి నిష్క్రమించిన తరుణంలో అమ్రుల్లా ఈ ప్రకటన చేయడం విశేషం. ఇలా ఉండగా ఆఫ్ఘన్ లో అధికార బదలాయింపు ప్రక్రియ సన్నాహాలు జోరందుకున్నాయి. మాజీ హోమ్ మంత్రి అలీ అహ్మద్ జలాలీ తాత్కాలిక అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టవచ్చునని సమాచారం. నూతన ప్రభుత్వంలో తాలిబన్లు మాత్రమే సభ్యులుగా ఉండాలన్న అంశంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ తాలిబన్ నేత ఆమిర్ ఖాన్ ముతాకీ ఇదివరకే కాబూల్ పొలిటికల్ లీడర్లతో చర్చలు జరిపారు. గతంలో తాలిబన్ల హయాంలో ఆయన విద్యా శాఖ మంత్రిగా వ్యవహరించారు.
అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు మాత్రం జటిలమైన కసరత్తేనని తెలుస్తోంది తాలిబన్లు కానీ వారిని కూడా ప్రభుత్వంలో చేర్చుకోవాలా వద్దా అన్న అంశం ప్రధానంగా ఉందని తాలిబన్ అధికార ప్రతినిధి సుహేల్ =షాహీన్ తెలిపారు. దీనిపై ఇదివరలో కూడా చర్చించినట్టు ఆయన చెప్పారు. చర్చలు ముగియగానే కొత్త ప్రభుత్వం గురించి ప్రకటిస్తారని ఆయన చెప్పారు. దేశంలో తాలిబన్ల రాజ్యం అన్న నానుడి స్థానే ప్రజాస్వామిక రాజ్యం రావాలన్నదే తమ నినాదమన్నారు. బహుశా రెండు మూడు రోజుల్లో నూతన ప్రభుత్వం ఏర్పడవచ్చునన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఈ చిన్నారి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో గెస్ చెయ్యగలరా ..?:Celebrity Baby Picture Video.
జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.