AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuclear War: ఉక్రెయిన్-రష్యా యుద్దంలో మరో మలుపు.. డ్యాం పేల్చివేత తర్వాత మారిన సమీకరణలు.. అదే జరిగితే అంతమే!

రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి అంతమెప్పుడు అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. భారత్ లాంటి న్యూట్రల్ దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అగత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

Nuclear War: ఉక్రెయిన్-రష్యా యుద్దంలో మరో మలుపు.. డ్యాం పేల్చివేత తర్వాత మారిన సమీకరణలు.. అదే జరిగితే అంతమే!
Putin - Zelensky
Rajesh Sharma
|

Updated on: Jun 09, 2023 | 8:02 PM

Share

Russia Invasion: ఉక్రెయిన్ దేశంపై రష్యా దురాక్రమణ 15 నెలలకుపైగా కొనసాగుతోంది. దుర్భేద్యమైన రష్యన్ సైన్యాన్ని ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటూనే వుంది. నాటో దేశాలు.. మరీ ముఖ్యంగా అమెరికా అందిస్తున్న ఆర్థిక, ఆయుధ సాయంతో ఉక్రెయిన్ స్వాభిమానంతో పోరాడుతూనే వుంది. ఈ యుద్దానికి అంతమెప్పుడు అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. భారత్ లాంటి న్యూట్రల్ దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అగత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని పక్కన పెడితే ఇపుడీ యుద్దం అణ్వస్త్రమయం కాబోతున్న సంకేతాలు తాజాగా వెల్లడవడం మాత్రం యావత్ ప్రపంచం ఆందోళన చెందాల్సిన అంశం. ఉక్రెయిన్‌ను ఎలాగైనా లొంగ దీసుకోవాలనుకుంటున్న రష్యా అంతిమ ప్రయోగంగా అణ్వస్త్రాలను ప్రయోగించబోతోందన్న సంకేతాలు రెండు, మూడు రోజులుగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అది అంతిమంగా మూడో ప్రపంచ యుద్దంగా మారి, యావత్ ప్రపంచం దద్దరిల్లక తప్పదు. తాజాగా ఒక డ్యామ్‌పై బాంబు దాడి జరగడం, దాని దిగువ ప్రాంతమంతా వరదలు ముంచెత్తడం తెలిసిందే. నోవాకఖోవ్కా డ్యాం ప్రమాదం కారణంగా ఇప్పటికి ఏడుగురు మరణించారని అధికారిక సమాచారం. కానీ మృతుల సంఖ్య పదుల్లో వుంటుందని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. ఉక్రెయిన్‌ అధీనంలో ఉన్న డ్యాం పశ్చిమ భాగాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సందర్శించారు. అక్కడి ప్రజలకు అందుతున్న సహాయాన్ని ఆయన పరిశీలించారు. డ్యాం మీద బాంబు పడడంతో అది పేలిపోయి వరద నీరంతా దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేరకు పారింది. ఫలితంగా ఆ ప్రాంతమంతా ముంపునకు గురైంది. దాదాపు 60 వేల మంది నిరాశ్రయులైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ బాధితులకు అంతర్జాతీయ సాయం మొదలైంది. ఫ్రాన్స్ 5 లక్షల వాటర్ ప్యూరిఫైయర్ టాబ్లెట్స్, మెషినరీ, కిట్స్ పంపింది. అయితే ఈ డ్యాంపై దాడికి పాల్పడిందెవరనే విషయంపై కూడా రగడ మొదలైంది. ఉక్రెయిన్ సైన్యమే దాడికి పాల్పడిందని రష్యా మిత్ర దేశం బెలారస్ ఆరోపించింది. మరోవైపు ఆనకట్ట తెగిపోయినందున నీట మునిగిన సీటీపై రష్యా సైనికులు దాడులకు పాల్పడ్డారని ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపించారు. దీంతో సహాయ కార్యక్రమాలను కొన్ని గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చిందని, ప్రెసిడెంటు జెలెన్‌స్కీ పర్యటన తర్వాత ఈ దాడులు జరిగాయని వివరించారు. దాడుల్లో ఎనిమిది మంది గాయపడినట్లు వెల్లడించారు. నీపర్‌ నదిపై కఖోవ్కా డ్యామ్‌ పేలుడుతో మరో మలుపు తీసుకున్న ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతో జనం కష్టాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లూ బాంబుల మోతతో బంకర్లతో, భూగర్భ గృహాల్లో తలదాచుకున్న ఉక్రెయినియన్లు ఇప్పుడు అవన్నీ జలమయం కావడంతో ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు. యుద్ధంలో శత్రుదేశ సైన్యం సంహారం కోసం జనావాసాలకు దూరంగా పూడ్చిపెట్టిన మందుపాతరలు వరదప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయి. ఇది భవిష్యత్‌నలో పలు పేలుళ్ళకు దారి తీయవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ వరదనీరు జనావాసాలను ముంచెత్తడంతో అవి ఇప్పుడు జనావాసాల్లో ఆ మందు పాతరలు ఎక్కడికి కొట్టుకొచ్చి ఆగిపోయాయో.. అవి ఎప్పుడు పేలతాయో అన్న భయం ఉక్రెనియన్లను వెంటాడుతోంది. నీటితో నిండిన నోవా కఖోవ్కా నగరంలో కొంతభాగం రష్యా అధీనంలో మరికొంత భాగం ఉక్రెయిన్‌ అధీనంలో ఉంది. స్థానికుల తరలింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. తాగునీరు కరువై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్, మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ పూర్తిగా పోయిందని అధికారులు చెప్పారు.

రష్యా కొత్త వాదన

ఇదిలా వుంటే.. క్రిమియా స్వాధీన ప్రక్రియపై తమకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ను రష్యా అభ్యర్థించింది. ఉక్రెయిన్ ఆరోపణలకు చట్టబద్ధత లేదని, కనీసం ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు కూడా ఉక్రెయిన్ వద్ద లేవని నెదర్లాండ్స్‌లో రష్యన్ రాయబారి.. ఐసీజేకు తెలిపారు. మరోవైపు, ఐసీజేలో విచారణ ప్రారంభం కాగానే రష్యా తన దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని ఉక్రెయిన్‌ ప్రతినిధులు వాదించారు. ఈ కేసులో వాదనలు మరో వారంలో ముగియనుండగా.. తీర్పు వెలువడడానికి మాత్రం చాలా కాలం పట్టే పరిస్థితి నెలకొంది. దుర్భేద్యమైన రష్యన్ సైన్యాన్ని ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటూనే వుంది. నాటో దేశాలు.. మరీ ముఖ్యంగా అమెరికా అందిస్తున్న ఆర్థిక, ఆయుధ సాయంతో ఉక్రెయిన్ స్వాభిమానంతో పోరాడుతూనే వుంది. ఈ యుద్దానికి అంతమెప్పుడు అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. భారత్ లాంటి న్యూట్రల్ దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అగత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని పక్కన పెడితే ఇపుడీ యుద్దం అణ్వస్త్రమయం కాబోతున్న సంకేతాలు తాజాగా వెల్లడవడం మాత్రం యావత్ ప్రపంచం ఆందోళన చెందాల్సిన అంశం. ఉక్రెయిన్‌ను ఎలాగైనా లొంగ దీసుకోవాలనుకుంటున్న రష్యా అంతిమ ప్రయోగంగా అణ్వస్త్రాలను ప్రయోగించబోతోందన్న సంకేతాలు రెండు, మూడు రోజులుగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అది అంతిమంగా మూడో ప్రపంచ యుద్దంగా మారి, యావత్ ప్రపంచం దద్దరిల్లక తప్పదు.