India-China: చర్చలు కొనసాగుతున్నాయ్.. చైనాకు ఒక్క అంగుళం భూమిని కూడా వదలలేదు: ఆర్మీ చీఫ్ నరవణె
India China Standoff: భారత్ - చైనా మధ్య గత కొన్ని నెలల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవలనే భారత్, చైనా దళాలు
India China Standoff: భారత్ – చైనా మధ్య గత కొన్ని నెలల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవలనే భారత్, చైనా దళాలు తూర్పు లఢఖ్ గల్వాన్ లోయ నుంచి వెనక్కి వెళ్లాయి. ఈ క్రమంలో భారత్-చైనా మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె స్పందించారు. చైనాకు ఒక్క అంగుళం భూభాగం కూడా వదులుకోలేదని ఆయన స్పష్టంచేశారు. ఇంకా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు భారత్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు నరవణె మంగళవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అక్రమంగా సైన్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎం.ఎం. నరవణె స్పష్టం చేశారు. తప్పని రుజువైతే ఆ వ్యక్తి సైన్యంలో చేరి 20 ఏళ్లు అయినా సరే తక్షణమే తొలగిస్తామంటూ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన పరీక్షల నిర్వహణ, ఎంపికల్లో అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. సెలక్షన్ బోర్డు సిబ్బంది అవినీతికి పాల్పడ్డారు. ఇది మా అంతర్గత దర్యాప్తు ద్వారానే వెలుగులోకి వచ్చిందని.. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించమని తేల్చి చెప్పారు. ప్రవేశ పత్రం లీక్‌కు సంబంధించి అనేక విధాలుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. బ్యాంక్, కాల్ రికార్డులను పరిశీలించాలని.. ఈ తరహా దర్యాప్తునకు తమకు అధికారం లేదన్నారు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు నరవణె తెలిపారు.
వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ వైపున ఇప్పటికీ ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, వ్యవస్థలూ కొనసాగుతున్నాయని నరవణె తెలిపారు. ఉగ్రవాదం తగ్గుముఖం పట్టాలంటే వీటన్నిటినీ కూల్చేయాలని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యవస్థల నిర్మూలను పాక్ ఏ మేరకు కట్టుబడి ఉందో త్వరలో తెలుస్తుందన్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఉగ్రవాద దాడుల గురించి ఆయన మాట్లాడుతూ.. దాడులను ఏమాత్రం ఉపక్షించమంటూ హెచ్చరించారు.
Also Read: