AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karachi Zoo: కరాచీ జూలో ఆహారం కొరత.. బక్కచిక్కిన సింహం వీడియో వైరల్.. ఫేక్ అంటున్న అధికారులు

Karachi Zoo: దాయాది దేశం పాకిస్థాన్ లో మనుషులు తినడానికి ఆహారం లేదు.. ప్రజలు ఒక పూట ఆహారం త్యాగం చేయమని స్వయంగా ఆ దేశ మంత్రి ప్రకటించడంతో అక్కడ తాజా..

Karachi Zoo: కరాచీ జూలో ఆహారం కొరత.. బక్కచిక్కిన సింహం వీడియో వైరల్.. ఫేక్ అంటున్న అధికారులు
Karachi Zoo Lion
Surya Kala
|

Updated on: Nov 26, 2021 | 9:17 PM

Share

Karachi Zoo: దాయాది దేశం పాకిస్థాన్ లో మనుషులు తినడానికి ఆహారం లేదు.. ప్రజలు ఒక పూట ఆహారం త్యాగం చేయమని స్వయంగా ఆ దేశ మంత్రి ప్రకటించడంతో అక్కడ తాజా పరిస్థితి అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు మనుషులకే కాదు.. జంతువులకు కూడా సరైన తిండి పెట్టకుండా వాటిని మరణం అంచు వరకూ తీసుకొచ్చారని ఓ వీడియో ద్వారా తెలుస్తోంది. అవును ఆదేశంలో లాహోర్ జూ తర్వాత కరాచీ జంతుప్రదర్శనశాల అతి పెద్దది.అతి పురాతనమైంది. అయితే ఈ జూ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. జూలో బలహీన సింహం నిస్సహాయంగా గర్జిస్తోంది. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు జూ అధికారుల నిర్లక్ష్యం అంటూ నిరసన తెలపడం ప్రారంభించారు. జూ నిర్వాహకులపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు.

అయితే కరాచీ ఈ జూ నిర్వాహకులు ఆహారం సరఫరా వేసేవారికి ఫిబ్రవరి నెల నుంచి డబ్బులు చెల్లించడం లేదని.. బకాయిలు భారీగా ఉండడంతో జూ కి ఆహారం సరఫరా చేయడం మానేసినట్లు కాంట్రాక్టర్ అమ్జద్ మెహబూబ్ చెప్పాడు.  నెలల తరబడి జీతం ఇవ్వలేదని కాంట్రాక్టర్ అమ్జద్ మెహబూబ్ ఆరోపిస్తూ జూకి ఆహార సరఫరా నిలిపివేశాడు.

అయితే కరాచీ మునిసిపల్ అధికారుల చొరవతో సమస్య పరిష్కరించబడింది. దీంతో జూ కి ఆహార సరఫరా పునరుద్ధరించబడింది. డిసెంబరు నాటికి కాంట్రాక్టర్ బకాయిలు క్లియర్ అవుతాయని అధికారులు అతనికి హామీ ఇచ్చారని అధికారులు చెప్పారు.

ప్రస్తుతం జూ పరిస్థితి ఇదంటూ ఓ జర్నలిస్ట్ జూలో సింహం  వీడియో షేర్అ చేయడంతో అక్కడ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సింహం బోనులో బంధించబడి.. బక్క చిక్కి.. ఎముకలు కనిపిస్తూ.. మగతగా నిద్రపోతుంది.  ఈ వీడియో షేర్ చేస్తూ.. “కరాచీ జూ నిర్వాహకులు ఆహార సరఫరాదారులకు డబ్బులు చెల్లించడంలో విఫలమయ్యారు. దీంతో తిండి లేకపోవడంతో.. జూలో జంతువుల పరిస్థితి భయంకరంగా ఉంది అంటూ ఓ కామెంట్ ను జత చేశారు.  ఈ వీడియోని సింహాన్ని చూసిన జంతువుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. జూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేలాది మంది పిలుపునిచ్చారు. అయితే ఈ వీడియో పై ఓ అధికారి స్పందిస్తూ.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో పాతదని.. జూ కి వ్యతిరేకంగా ఈ వీడియో షేర్ చేస్తున్నారని అన్నారు. ఆహార సరఫరా నిలిపివేసినప్పటికీ.. జూలో ఒక వారానికి సరిపడే ఆహార నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఇదే విషయంపై కరాచీ జూ సీనియర్ డైరెక్టర్ ఖలీద్ హష్మీ స్పందిస్తూ.. ఇదంతా కల్పితమని.. జూలో ఆహార సరఫరా కొరత లేదని, జూని సందర్శించి జంతువులను స్వయంగా చూడమని ప్రజలను ఆహ్వానించారు.

Also Read:  ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారా శుక్రవారం లక్ష్మీదేవిని ఈ మంత్రాలతో పూజించండి.. అద్భుత ఫలితం మీ సొంతం