New Labor Codes: ఇకపై వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు.. అమల్లోకి సరికొత్త రూల్.. ఎక్కడంటే?

వారానికి 3 రోజులు సెలవులు.. వినడానికే ఎంతో హాయిగా ఉంది కదా.. అయితే ఇకపై వినడానికే కాదు.. వాస్తవం కూడా అదే కాబోతోంది.

New Labor Codes: ఇకపై వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు.. అమల్లోకి సరికొత్త రూల్.. ఎక్కడంటే?
Employees
Follow us
Venkata Chari

|

Updated on: Feb 22, 2023 | 6:48 AM

Four Day Work Week: వారానికి 3 రోజులు సెలవులు.. వినడానికే ఎంతో హాయిగా ఉంది కదా.. అయితే ఇకపై వినడానికే కాదు.. వాస్తవం కూడా అదే కాబోతోంది. అయితే అది ఇండియాలో కాదండోయ్.. బ్రిటన్లో. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంటున్నాయి. అసలు ఈ విధానం వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేంటి?

బ్రిటన్లో వారానికి 4 రోజులే పని..

వారానికి 4 రోజులే పని… దీని గురించి చర్చ ప్రపంచ వ్యాప్తంగా చాలా రోజులనుంచి జరుగుతోంది. యూరోపియన్ దేశాల్లో ప్రముఖ కంపెనీలు గత కొద్ది నెలలుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తొలిసారిగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని బ్రిటన్ కంపెనీలు నిర్ణయించాయి. ఇప్పటి వరకు సుమారు 61 కంపెనీలు గత ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 6 నెలలు పాటు వారానికి 34 గంటల పని విధానాన్ని ఉద్యోగుల జీతాల్లో కోత విధించకుండా ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటిల్లో 56 కంపెనీలు అదే విధానాన్ని మరి కొన్నాళ్లు కొనసాగించాలని నిర్ణయించగా 18 కంపెనీలు మాత్రం వారానికి నాలుగు రోజుల పనిని శాశ్వతంగా కొనసాగించాలని డిసైడ్ అయ్యాయి.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగైందంటున్న కంపెనీలు..

ఈ విధానంపై బ్రిటన్‌కి చెందిన అటానమీ అనే సంస్థ చేసిన పరిశోధనలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వివిధ కంపెనీలకు 2900 సిబ్బందిని ఈ పరిశోధనలో భాగస్వాముల్ని చేసింది. నాలుగు రోజుల పని విధానాన్ని వల్ల ఉత్పాదకతలో ఎలాంటి తేడా లేదని ఆయా కంపెనీలు చెప్పడం విశేషం. అదే సమయంలో ఉద్యోగుల విషయానికి వస్తే వర్క్ లైఫ్‌ బ్యాలెన్స్ చెయ్యడం చాలా వరకు మెరుగయ్యిందని ఈ విధానం వల్ల ఎప్పటికప్పుడు ఉద్యోగాలను వదిలిపెట్టే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందనన్నది ఈ పరిశోధనలో వెల్లడైన మరో ఆసక్తికరమైన అంశం.

ఇవి కూడా చదవండి

తిరిగి ఉద్యోగాల్లోకి చేరే వారి సంఖ్య పెరిగింది. అలాగే సిక్ లీవ్‌లు పెట్టే వారి సంఖ్య కూడా తగ్గింది. సిబ్బంది చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని చెయ్యడం మొదలయ్యిందన్నది మెజార్టీ కంపెనీ యాజమాన్యాలు చెప్పిన మాట. చాలా మంది ఉద్యోగులు జీతం కన్నా ఓ రోజు సెలవు అదనంగా ఇవ్వడమే తమకు ముఖ్యమని వెల్లడించారు. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ప్రొఫెషనల్ సర్వీసులకు చెందిన ఉద్యోగులపై ఈ పరిశోధన జరిగింది. గడచిన కొన్నేళ్లలో మైక్రోసాఫ్ట్, యూనిలీవర్ వంటి కంపెనీలు ఫోర్ డే వీక్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించి సానుకూల ఫలితాలను సాధించాయి కూడా.

మైక్రోసాఫ్ట్ జపాన్‌లో 2019లో నెల రోజుల పాటు ఇదే పద్ధతిని పరిశీలించగా, యూనిలీవర్ 2020లో న్యూజీలాండ్‌లో ఏకంగా ఏడాది పాటు పరిశీలించింది. అయితే బ్రిటన్‌లో ఈ విధానం పట్ల పెద్దగా ఆసక్తి చూపని కంపెనీలు కూడా ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్‌ ప్రోఫెషనల్స్‌ను అందించే చార్టెడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డవలప్మెంట్ CPID నిర్వహించిన సర్వేలో చాలా తక్కువ మంది ఉద్యోగులు మాత్రమే ఈ విధానం పట్ల ఆసక్తి చూపారని తేలింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..