Prince Charles 3: నేడు కింగ్ చార్లెస్-3 కి కిరీటధారణ .. బ్రిటన్‌లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేక మహోత్సవం
పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా.. ముందుగా ప్రదక్షిణ, పరిచయ కార్యక్రమం ఉంటుంది. బ్రిటన్‌లోని కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ తొలుత కింగ్ ఛార్లెస్‌ను ఆహూతులకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత.. రెండు ప్రమాణాలు చేయనున్నారు కింగ్ చార్లెస్. చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేస్తారు
రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో తొలి రాజ పట్టాభిషేకం ఇవాళ జరగబోతోంది. బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ చేయనున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో జరుగుతున్న తొలి పట్టాభిషేకంగా రికార్డ్‌కెక్కబోతోంది. ఇప్పటివరకు రాణులు పాలించగా.. తొలిసారిగా ఒక రాజు నాయకత్వం వహించబోతున్నాడు.
క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 రాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. మరికొన్ని గంటల్లోనే ఆ వేడుక జరుగనుంది. ఇవాళ సాయంత్రం సరిగ్గా నాలుగున్నర గంటలకు పట్టాభిషేకం జరుగనుంది. నిజానికి.. బ్రిటన్‌లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. చివరిసారిగా 1953లో ఎలిజబెత్ రాణికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అయితే.. గతేడాది ఆమె కన్నుమూయడంతో కొత్త రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్ నియమితులయ్యారు. ఈ క్రమంలో.. చార్లెస్ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించబోతోంది యూకే ప్రభుత్వం. పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.
పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా.. ముందుగా ప్రదక్షిణ, పరిచయ కార్యక్రమం ఉంటుంది. బ్రిటన్‌లోని కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ తొలుత కింగ్ ఛార్లెస్‌ను ఆహూతులకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత.. రెండు ప్రమాణాలు చేయనున్నారు కింగ్ చార్లెస్. చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత చర్చి ఆఫ్ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్ రెండో ప్రమాణం చేస్తారు.
ఇక.. ప్రమాణం పూర్తికాగానే… 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనంపై కూర్చోనున్నారు కింగ్ చార్లెస్. ఆపై.. వెంటనే ఆర్చ్‌బిషప్ కింగ్ ఛార్లెస్‌ను పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. నూనెతో అభిషేకం పూర్తికాగానే.. ఛార్లెస్‌కు బంగారుతాపడంతో చేసిన మహారాజ గౌన్ తొడిగి కూర్చోబెడతారు. ఆ తర్వాత.. శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్‌బిషప్ ఆయనకు అందిస్తారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేస్తారు.
ఇక.. కింగ్ ఛార్లెస్.. పట్టాభిషేక కుర్చీలోంచి లేచి.. రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని సింహాసనంపై ఆసీనులవుతారు. సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చ్‌బిషప్‌తోపాటు రాజకుటుంబికులు, రక్తసంబంధీకులైన యువరాజులు, రాజ కుటుంబ సిబ్బంది మోకాళ్లపై కూర్చొని ఆయన కుడి చేతిని ముద్దాడతారు. ఇది కాగానే… రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేస్తారు. కిరీటధారణతో చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం ముగియనుంది. ఇక.. ఈ మొత్తం ప్రక్రియంతా సుమారు 2 గంటలపాటు సాగే అవకాశముంది. మొత్తంగా.. 70 ఏళ్ల తర్వాత జరుగుతున్నప్రిన్స్ చార్లెస్ పట్టాభిషేకం కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..