AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: గుడ్ న్యూస్.. కరోనాపై కీలక ప్రకటన చేసిన డబ్ల్యూహచ్‌వో.. ఇకపై ప్రపంచ విపత్తు కాదంటూనే..

కరోనావైరస్.. ఈ పేరు వింటే ఒకప్పుడు అలజడి.. బయటకు అడుగు వేయాలంటే గజగజ వణికిపోయేవారు.. ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టింది. కంటికి కనిపించని వైరస్ తో ఎన్నో దేశాలు తీవ్రంగా పోరాడాయి. అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి.

Coronavirus: గుడ్ న్యూస్.. కరోనాపై కీలక ప్రకటన చేసిన డబ్ల్యూహచ్‌వో.. ఇకపై ప్రపంచ విపత్తు కాదంటూనే..
Coronavirus Who
Shaik Madar Saheb
|

Updated on: May 06, 2023 | 9:33 AM

Share

కరోనావైరస్.. ఈ పేరు వింటే ఒకప్పుడు అలజడి.. బయటకు అడుగు వేయాలంటే గజగజ వణికిపోయేవారు.. ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టింది. కంటికి కనిపించని వైరస్ తో ఎన్నో దేశాలు తీవ్రంగా పోరాడాయి. అన్ని రంగాలు అతలాకుతలమయ్యాయి. 2020 నుంచి కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.. కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.. ఎన్నో కుటుంబాలు బంధువులను కోల్పోయి గుండెలవిసేలా రోదించాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఈ ప్రపంచ విపత్తు పేరు వింటే గుండెల్లో దడపుట్టాల్సిందే.. అయితే ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19 పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. ప్రపంచ విపత్తుగా పరిగణించేంతటి స్థాయిలో కరోనా వైరస్ ప్రభావం లేదని.. మూడు సంవత్సరాల క్రితం కోవిడ్-19 కోసం ప్రకటించిన ఎమర్జెన్సీని ముగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

కోవిడ్ సంక్షోభంపై చర్చించిన WHO అత్యవసర కమిటీ ఇకపై.. కరోనాను హైఎమర్జెన్సీ స్థాయికి అర్హమైనది కాదని నిర్ణయించార. COVID-19 మహమ్మారి దీర్ఘకాలిక నిర్వహణకు ఇది మారడానికి సమయం ఆసన్నమైందని నిపుణుల కమిటీ సూచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అయితే మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని, ఇప్పటికీ అది ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగానే ఉందని పేర్కొంది. దాని బారిన పడి ప్రతివారం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు.

అయితే, ప్రపంచాన్ని కొవిడ్‌ మళ్లీ ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉందా అన్న విషయంపై నిపుణులతో మరోసారి సమీక్ష జరపడానికి వెనకాడమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఈ సందర్భంగా వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..