Sienna Weird: ప్రాణం తీసిన గుర్రపు స్వారీ.. మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ ఇక లేరు.
మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ మోడల్ సియెన్నా వీర్ ప్రమాదంలో చనిపోయారు. 23 ఏళ్ల సియెన్నా గత నెల 2న గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె.. అప్పటి నుంచి లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. గత నెలరోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితిలో
మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్, ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ మోడల్ సియెన్నా వీర్ ప్రమాదంలో చనిపోయారు. 23 ఏళ్ల సియెన్నా గత నెల 2న గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె.. అప్పటి నుంచి లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. గత నెలరోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు లైఫ్ సపోర్టును తీసేయాలని నిర్ణయించారు.
దీంతో ఆమె కన్నుమూశారు. 2022లో జరిగిన ఆస్ట్రేలియన్ మిస్ యూనివర్స్ పోటీలకు ఎంపికైన 27 మంది ఫైనలిస్టుల్లో ఒకరు. ఇంగ్లిష్ లిటరేచర్‌తోపాటు సైకాలజీలో డబుల్ డిగ్రీ చేసిన సియెన్నా ఏప్రిల్ 2న సిడ్నీలోని విండ్‌సోర్ పోల్ గ్రౌండ్‌లో గుర్రపు స్వారీ చేస్తుండగా కిందపడిపోయారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎంతో ట్యాలెంట్, అందం ఉన్న సియెన్నా 23 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడంతో ఫ్యాషన్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సియెన్నా కెరీర్ విషయానికొస్తే.. ఈమె సిడ్నీ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ రిటరేచర్, సైకాలజీలో డబుల్ డిగ్రీ చేశారు. ఫ్యాషన్‌తో పాటు సియెన్నాకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. గతంలో ఓ ఇంటర్వ్యూలో గుర్రపు స్వారీపై తనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చింది సియెన్నా. గుర్రపు స్వారీ లేకుండా తన జీవితాన్ని ఊహించలేనని గుర్రపుస్వారీ అంటే నాకు చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ గుర్రపు స్వారీ కారణంగానే ఆమె మృతి చెందడం విషాదకరం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..