AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Elections 2024: అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది.. ఎవరికి ఎన్ని ఓట్లంటే?

అమెరికాలో జరుగుతున్న ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది.గత కొన్ని నెలల్లో అమెరికా అధిపతి ఎవరు అవుతారని ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా అమెరికాలోని ఓ రాష్ట్రంలో ఫలితాలు వెల్లడైయ్యాయి.

US Elections 2024: అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది.. ఎవరికి ఎన్ని ఓట్లంటే?
First Us Election Results
Velpula Bharath Rao
|

Updated on: Nov 05, 2024 | 5:40 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వెల్లడైంది.  అక్కడ ఆరు ఓటర్లు ఉండగా ట్రంప్‌కు మూడు, కమలా హారీస్ మూడు ఓట్లు వచ్చాయి. ఇక్కడ సోమవారం అర్ధరాత్రి నుండి ఎన్నికలు మొదలైయ్యాయి. 2022లో జరిగిన ఎన్నికల్లో జో బైడన్ వైపు డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు మొగ్గు చూపారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్,  డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది.

USలోని తూర్పు తీరంలో ఓటింగ్ ప్రారంభమైంది. ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిచిగాన్‌లోని చాలా వరకు ఏడు యుద్ధభూమి రాష్ట్రాలలో నాలుగింటిలో ఎన్నికలు ముగిసినప్పటికీ, ఎవరు గెలిచారో తెలియడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. ఒపీనియన్ పోల్స్‌లో దాదాపు మూడింట రెండు వంతుల మంది ఓటర్లు అధ్యక్షుడు జో బిడెన్ హయాంలో దేశం తప్పు దిశలో పయనిస్తున్నారని అభిప్రాయపడ్డారు. యుఎస్ ఎన్నికల ఫలితాలు కొన్నిసార్లు ఎన్నికలు ముగిసిన కొన్ని గంటల్లోనే ప్రకటించబడుతాయి. అయితే ఈ సంవత్సరం గట్టి పోటీ ఉండడంతో ఎక్కువసేపు వేచి ఉండవలసి వస్తుంది. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ ఎవరు గెలిచినా చరిత్రే అని చెప్పాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి