Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: ఈ భవనంలో వేల టన్నుల బంగారం.. 24 గంటలు కమాండోల మోహరింపు.. నిఘా నీడలో ఫోర్ట్ నాక్స్

Gold: ఈ భవనంలో వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ భవనంలోకి చీమైన దూరని విధంగా భద్రత ఉంటుంది. ఈ భవనం 24 గంటల పాటు కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉంటుంది. అంతేకాదు.. హెలికాప్టర్‌ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు కమాండోలు..

Gold: ఈ భవనంలో వేల టన్నుల బంగారం.. 24 గంటలు కమాండోల మోహరింపు.. నిఘా నీడలో ఫోర్ట్ నాక్స్
Follow us
Subhash Goud

|

Updated on: Nov 05, 2024 | 2:46 PM

Fort Knox Gold: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో బంగారం నిల్వలు ఉన్నాయి. అత్యధికంగా బంగారం నిల్వలు దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఎనిమిదో స్థానంలో భారత్‌ ఉంది. ఇక అమెరికాలో వందల టన్నుల బంగారాన్ని కట్టుదిట్టమైన భద్రతలో ఉంచే భవనం ఉంది. అమెరికాలోని ఫోర్ట్ నాక్స్‌లో ఈ బంగారం ఉంది. ఈ బంగారానికి సైనికులతో భారీ భద్రత ఉంటుంది.

ఫోర్ట్ నాక్స్ భవనం:

ఫోర్ట్ నాక్స్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. సూపర్ పవర్ అమెరికా తన దేశంలోని భారీ బంగారు నిల్వలను ఇక్కడే ఉంచుతుంది. ఈ భవనం చాలా పెద్దగా ఉంటుంది. క్యాంపస్‌లో వివిధ భవనాలు ఉన్నాయి. ఇందులో సైన్యం, వారి కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ వ్యక్తులు ఈ భవనాన్ని కాపాడుతున్నారు. ఇక్కడే ఒక భవనం లోపల ఒక ఖజానా ఉంది. ఇందులో వందల టన్నుల బంగారాన్ని నిల్వ చేశారు.

ఇవి కూడా చదవండి

ఫోర్ట్ నాక్స్‌లో ఎంత బంగారం?

యునైటెడ్ స్టేట్స్ మింట్ ప్రకారం.. ఫోర్ట్ నాక్స్ ప్రస్తుతం 14.7 మిలియన్ ఔన్సుల బంగారాన్ని కలిగి ఉంది. దాన్ని టన్నులుగా మార్చితే దాదాపు 4 వేల 175 టన్నుల బంగారం నిల్వ ఉంటుంది.

ఫోర్ట్ నాక్స్‌లో కీలక విషయాలు..

ఫోర్ట్ నాక్స్ బంగారంతో భద్రత ఉండడమే కాకుండా అసలు అమెరికన్ స్వాతంత్ర్య ప్రకటన, గుటెన్‌బర్గ్ బైబిల్, US రాజ్యాంగం అసలైన ప్రతిని కూడా ఇందులో ఉన్నాయి.

బంగారం ఎలా స్టోర్‌ చేస్తారు?

ఫోర్ట్ నాక్స్ వద్ద బంగారాన్ని బార్ రూపంలో ఉంచారు. దీనిని బూలియన్ అని కూడా అంటారు. ఇది 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం. ప్రతి బార్ 12.5 కిలోలు లేదా 27.5 పౌండ్ల బరువు ఉంటుంది. ఇది అమెరికన్ ప్రమాణాల ప్రకారం 7 అంగుళాల పొడవు, 3.5 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. ఈ బార్లు వాటి నిర్దిష్ట బరువు, కొలతలు ప్రకారం పూర్తిగా స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) స్వచ్ఛమైన బంగారం ఈ ప్రమాణాన్ని రూపొందించింది. దీనిని యునైటెడ్ స్టేట్స్ కూడా ఆమోదించింది.

ఫోర్ట్ నాక్స్ భవనం చరిత్ర ఏమిటి?

ఈ భవనానికి మొదటి US సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ నాక్స్ పేరు పెట్టారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ప్రదేశం సైనిక స్థావరానికి బదులుగా బంగారం నిల్వ కోసం ఉపయోగించారు. ఈ భవనం 16,000 క్యూబిక్ అడుగుల గ్రానైట్, 4,500 గజాల కాంక్రీటుతో నిర్మించారు. ఇందులో వేల టన్నుల ఉక్కును వినియోగించారు. ఈ భవనం 1941లో పూర్తయింది. ఈ ప్రధాన భవనాన్ని యునైటెడ్ స్టేట్స్ బులియన్ డిపాజిటరీ అంటారు.

భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది?

ఫోర్ట్ నాక్స్ గోడలు సుమారు 3 అడుగుల మందంతో ఉంటాయి. దాని ప్రధాన ద్వారం 20 టన్నులు. ఆ ప్రాంతాన్ని అపాచీ హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. ఉక్కు కంచె, బలమైన భద్రత కారణంగా దీనికి ఫోర్ట్ నాక్స్ అని పేరు పెట్టారు.

భద్రత స్థాయిలు:

ఫోర్ట్ నాక్స్ డోర్‌లకు 10 వేర్వేరు ఉద్యోగుల కలయిక కోడ్‌లు కేటాయించారు. ఈ కోడ్‌లు వారికి తప్ప ఇతర ఉద్యోగుల తెలియవు. ఫోర్ట్ నాక్స్ కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది. ఇందులో సైనికుల రక్షణ, సాంకేతిక భద్రత, కమాండో వంటివి ఉన్నాయి. భవనం భద్రతలో ఎటువంటి ఉల్లంఘన జరగకుండా చూసేందుకు, సైనిక విభాగాలు రహస్యంగా పర్యవేక్షిస్తుంటారు.

Fort Knox Gold

Fort Knox Gold

ఇది కూడా చదవండి: Gold Rate Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి