గాల్లో ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు కాదు... ఆకాశంలో విమాన ప్రమాదాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇంజన్ ఫేయిలవ్వడం లేదా సాంకేతిక సమస్యలు తలెత్తి సిగ్నల్స్ పోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. కొన్నిసార్లు వీటి నుంచి తప్పించుకునేందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రయాణికులను కాపాడుతుంటారు ఫైలట్లు.

గాల్లో ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
Flight
Follow us

|

Updated on: Mar 27, 2023 | 3:50 PM

రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు కాదు… ఆకాశంలో విమాన ప్రమాదాలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇంజన్ ఫేయిలవ్వడం లేదా సాంకేతిక సమస్యలు తలెత్తి సిగ్నల్స్ పోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. కొన్నిసార్లు వీటి నుంచి తప్పించుకునేందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ప్రయాణికులను కాపాడుతుంటారు ఫైలట్లు. మరికొన్ని సార్లు అది కూడా కుదరకపోవడంతో విమానం క్రాష్ అయిపోతోంది. ఇలాంటి ఘటనలు కూడా ఎన్నో జరిగాయి. ఒకవేళ ఆకాశంలో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొంటే ఎలా ఉంటుంది. ఆ ఊహే ఆలోచించడానికి భయంకరంగా ఉంటుంది. తాజాగా భారత్, నేపాల్ లకు కి చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఎదురుపడి ఢీకొనేంత చేరువలకి వచ్చేశాయి. పైలట్లును అప్రమత్తం చేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో నేపాల్ విమానయాన సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. కంట్రోలర్ ల అజాగ్రత్త కారణంగానే ఇలా జరిగిందని నిర్ధరిస్తూ ఇద్దరు కంట్రోలర్ లపై వేటు విధించింది.

శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండ్ కు వస్తున్న నేపాల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం.. న్యూఢిల్లీ నుంచి ఖాట్మండ్ కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఢీకొనేంత పని చేశాయి. ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల నుంచి దిగుతుండగా… అదే ప్రదేశంలో నేపాల్ ఎయిర్ లైన్స్ సుమారు 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండు విమానాలు సమీపంలోకి వచ్చాయని రాడర్ చూపించడంతో వార్నింగ్ సిస్టమ్ ద్వారా పైలట్లను అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఏడు వేల అడుగులకు కిందికి దిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఘటన పట్ల సీరియస్‌ అయిన నేపాల్‌ పౌర విమానాయన అథారిటీ ఇది ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకున్నట్లు పేర్కొంది. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగినప్పుడూ కంట్రోల్‌ రూంకు ఇన్‌చార్జ్‌గా ఉన్న ఇద్దరు ఉద్యోగుల్ని  సీఏఏఎన్‌ సస్పెండ్‌ చేసింది. అయితే ఈ ఘటనపై దీనిపై ఎయిర్‌ ఇండియా నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ..

చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే