AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతీయ సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు

US Man Sentenced: ఐదేళ్ల కుమార్తె మాయా పటేల్‌ హోటల్‌ గదిలో ఆడుకుంటుండగా తలలోకి ఓ తూటా దూసుకెళ్లింది.

భారతీయ సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు
Us Man Sentenced To 100 Years
Balaraju Goud
|

Updated on: Mar 27, 2023 | 3:34 PM

Share

భారతీయత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మృతికి కారణమైన వ్యక్తికి 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది అమెరికా న్యాయస్థానం. 35 ఏళ్ల శ్రేవ్‌పోర్ట్‌కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తికి 100 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి జాన్ డి మోస్లీ తీర్పు చెప్పారు. 2021లో US రాష్ట్రం లూసియానా. మార్చి 2021లో మాయా పటేల్‌ను చంపినందుకు సంబంధించి న్యాయమూర్తి స్మిత్‌కి శిక్ష విధించారు.

మాంక్‌హౌస్‌ డ్రైవ్‌లోని భారతీయ సంతతికి చెందిన స్నేహల్‌ పటేల్‌, విమల్‌ దంపతులు ఓ హోటల్‌ను నడిపేవారు. మార్చి 2021లో వారి ఐదేళ్ల కుమార్తె మాయా పటేల్‌ హోటల్‌ గదిలో ఆడుకుంటుండగా తలలోకి ఓ తూటా దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఆ చిన్నారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి మాయా.. మార్చి 23న ప్రాణాలు విడిచింది. హోటల్‌ పార్కింగ్‌ స్థలంలో ఓ వ్యక్తితో గొడవపడిన నిందితుడు లీ స్మిత్.. అతడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అది గురితప్పి హోటల్‌ గదిలో ఆడుకుంటోన్న చిన్నారి తలలోకి దూసుకెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ ఏడాది జనవరిలోనే స్మిత్‌ను దోషిగా నిర్దారించిన జిల్లా న్యాయస్థానం.. తాజాగా శిక్షను ఖరారు చేసింది. హత్య చేసినందుకు 60 ఏళ్లు, న్యాయ విచారణకు ఆటంకం కలిగించినందుకు 20 ఏళ్లు, హాని తలపెట్టినందుకు 20 ఏళ్లు కలిపి మొత్తం 100 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రొబేషన్‌, పెరోల్‌, శిక్ష తగ్గింపు లాంటి సదుపాయాలేవీ లేకుండా శిక్షను అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..